HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Suspension Imposed On Former Ap Cid Dg Sanjay

Ex AP CID Chief Sanjay: ఏపీ సీఐడీ మాజీ డీజీ సంజయ్ పై సస్పెన్షన్ వేటు…

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. నిధుల మళ్లింపుతో పాటు అధికార దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఆయనకు ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. సర్వీసు నిబంధనల ఉల్లంఘన కారణంగా ఈ నిర్ణయం తీసుకొని, సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు.

  • By Kode Mohan Sai Published Date - 11:16 AM, Wed - 4 December 24
  • daily-hunt
Ex Ap Cid Chief Sanjay
Ex Ap Cid Chief Sanjay

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సర్వీసు నిబంధనల ఉల్లంఘన కారణంగా సంజయ్‌పై ఈ చర్య తీసుకోబడ్డింది. ఆయనపై నిధుల దుర్వినియోగం, అధికార ప్రదర్శనలో అక్రమాలు జరిపాడని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సంజయ్‌ పదవిలో ఉండగా టెండర్లు లేకుండా ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్‌లు కొనుగోలు చేసినట్టు, అలాగే అగ్నిమాపకశాఖ డీజీగా ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటి ఆధారంగా సంజయ్‌పై చర్యలు చేపట్టిన ప్రభుత్వం, విచారణ పూర్తి అయ్యేవరకు ఆయన విజయవాడ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసింది.

అఖిలభారత సర్వీసుల నియమావళి 3(1) సెక్షన్ ప్రకారం సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై సస్పెన్షన్ ఆదేశాలు జారీచేసింది. అనుమతి లేకుండా ఆయన విజయవాడ వదిలి వెళ్లకూడదని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.

సంజయ్ సీఐడీ అదనపు డీజీగా, ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేశారు. విధుల్లో ఉండగా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అఖిలభారత సర్వీసుల క్రమశిక్షణ, రూల్ 1969లోని నిబంధన 3(1) కింద సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసింది.

అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేస్తున్న సమయంలో టెండర్ ప్రక్రియలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. అగ్ని పోర్ట్లలో ఎన్వోసీలను జారీ చేయడంలో, రూ.2.29 కోట్ల విలువైన హార్డ్‌వేర్ సరఫరా ఒప్పందాన్ని ‘సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్’ కు అప్పగించడం వంటి చర్యలు తీసుకున్నారని తెలిపింది. 2023 ఫిబ్రవరి 23న జరిగిన ఒప్పందం ప్రకారం రూ.59.93 లక్షలు చెల్లించబడ్డాయి. అయితే, 2023 ఏప్రిల్ నాటికి కేవలం 14% మాత్రమే ప్రాజెక్టు పూర్తి అయినట్లు విచారణలో తేలింది.

అలాగే, మైక్రోసాఫ్ట్ లాప్‌టాప్‌లు, యాపిల్ ఐప్యాడ్లు టెండర్ ప్రక్రియ లేకుండా డీజీ హోదాలో సంజయ్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఈ కొనుగోళ్లలో రూ.17.89 లక్షలు అధిక చెల్లింపులు జరిగాయని విజిలెన్స్ నివేదిక వెల్లడించింది.

సదస్సుల పేరుతో అధిక బిల్లులు:

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అవగాహన సదస్సుల నిర్వహణ పేరుతో భారీ బిల్లులు సమర్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ సదస్సులు నిర్వహించినట్లు చూపించి, వాటి ద్వారా కోట్లలో బిల్లులు తీసుకున్నారు. ఈ కార్యక్రమాలు కృతి వ్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా నిర్వహించబడ్డాయి.

సదస్సుల నిర్వహణకు వ్యయంగా రూ. 3.10 లక్షలు ఖర్చు చేసినప్పటికీ, కోటి 15 లక్షల అదనపు బిల్లులు చెల్లించడం జరిగింది. ఆర్థిక పారదర్శకత లేకుండా, అడ్రస్‌ లేని సంస్థకు టెండర్లను కట్టబెట్టారు. ఈ అనుమానాస్పద వ్యవహారం గురించి ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

అధికార దుర్వినియోగం, ప్రజాధనాన్ని అర్థం చేసుకోకుండా ఖర్చు చేయడం, నిబంధనలను ఉల్లంఘించడం వంటి కారణాలపై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాక, ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ వదిలి వెళ్లకూడదని సంజయ్‌కు ఆదేశాలు జారీ చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP government
  • CID Chief Sanjay Suspended
  • Ex AP CID Chief Sanjay
  • Nara Chandrababu Naidu
  • nara lokesh
  • Pawan Kalyan

Related News

New direction for strengthening rural medical services in AP.. Government approves 2309 health clinics

AP : గ్రామీణ వైద్య సేవల బలోపేతానికి నూతన దిశ..2309 హెల్త్ క్లినిక్‌లకు ప్రభుత్వం ఆమోదం

ఈ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం కోసం రూ.217.10 కోట్ల నిధులను జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద విడుదల చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయుష్మాన్ భారత్‌ పథకం కింద తీసుకువచ్చిన ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు చేరువవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

    Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

  • Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

    Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

  • Nara Lokesh

    Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్

  • Language barriers should be removed to benefit future generations: Pawan Kalyan

    Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!

Latest News

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

  • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd