JC Prabhakar : ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇలాంటి పరిస్థితి బాధాకరం: జేసీ ప్రభాకర్
ప్రజల్ని, తమను ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఇప్పటికైనా గుర్తించాలని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి హితవు
- By Latha Suma Published Date - 05:18 PM, Wed - 14 August 24

JC Prabhakar : ఐపీఎస్ అధికారుల(IPS officers)కు కండీషన్ బెయిల్ లాంటి రోజూ డీజీపీ కార్యాలయంలో సంతకాలు పెట్టాల్సి రావడం దురదృష్టకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ప్రజల్ని, తమను ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇలాంటి పరిస్థితి రావటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. వారికి ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. పెండింగ్‌లోనే ఉంచారు. తాజాగా ఈ అధికారులకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు. హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులే లేరని గుర్తించి.. కీలక ఆదేశాలు జారీ చేశారు.
Andhra Pradesh: ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న 16 మంది సీనియర్ IPS అధికారులు రోజూ ఉదయం 10.00 గంటలకు DGP కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. 'హాజరు రిజిస్టర్‌లో సంతకం' చేయాలని కోరారు. ఆఫీసు నుంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా సంతకం చేయాలని డీజీపీ ఆఫీస్ పేర్కొంది. pic.twitter.com/2A48pDA4rH
— Newsmeter Telugu (@NewsmeterTelugu) August 14, 2024
బదిలీకి గురైన 16 మంది ఐపీఎస్ అధికారులు అందుబాటులో లేకపోవడంపై డీజీపీ తిరుమలరావు సీరియస్ అయ్యారు. ఈ మేరకు వారికి మెమోలు జారీ చేశారు. 16 మంది ఐపీఎస్ అధికారులు డీజీపీ హెడ్‌క్వార్టర్స్‌కు టచ్‌లో ఉండాలని చెప్పారు. ఐపీఎస్‌లు పీఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్, సునీల్ కుమార్‌తో పాటు కాంతి రాణా, అమ్మిరెడ్డి, రఘురామిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రిషాంత్ రెడ్డి, రవిశంకర్, పరమేశ్వర్ రెడ్డి, రఘువీరారెడ్డి, పాలరాజు, జుషువా, అన్బురాజన్, కృష్ణపటేల్‌కు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ డీజీపీ కార్యాలయంలో అందుబాటులో డీజీపీ తిరుమల రావు మెమోల్లో పేర్కొన్నారు. అలాగే అటెండెన్స్ రిజిస్ట్రర్‌లో సంతకాలు చేయాలని మెమోలో పేర్కొన్నారు. కార్యాలయం వెళ్లేటప్పుడు కూడా సంతకాలు చేయాలని సూచించారు.
Read Also: Cancer Risk: అండాశయ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలివే..!