Tirumala Laddu Controversy : పవన్ ఫై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి
Tirumala Laddu Controversy : హిందుత్వం పేరు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే యెదవ
- By Sudheer Published Date - 08:02 PM, Wed - 25 September 24

తిరుమల లడ్డూ(Tirumala Laddu)లో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాయశ్చిత్త దీక్ష (Prayaschitta Deeksha) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక లడ్డు విషయంలో కానీ హిందూ దేవుళ్ల పై కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడిన , సెటైర్లు వేసిన , సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై శ్రీ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది.
శ్రీ రెడ్డి (Sri Reddy)..సోషల్ మీడియాలో ఈమె గురించి తెలియని వారు ఉండరు. అప్పుడెప్పుడో తనకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తున్నారని..కనీసం మా సభ్యత్వం కూడా ఇవ్వడం లేదంటూ ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్నంగా నిరసన తెలిపి మీడియా చానెల్స్ ను తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత చిత్రసీమలో చాలామంది తనతో ఎఫైర్లు నడిపించారని చెప్పి పలువురి హీరోల పేర్లు , దర్శకులు , నిర్మాతల పేర్లు తెలిపి షాక్ ఇచ్చింది. ఈమె చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని..ఆమెను పట్టించుకోవద్దంటూ వారంతా డిసైడ్ కావడమే కాదు పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం తో హైదరాబాద్ నుండి చెన్నై కి మకాం మార్చేసింది. అప్పటి నుండి వైసీపీ కి సపోర్ట్ ఇస్తూ..జగన్ ఫై ఎవరైనా విమర్శలు , ఆరోపణలు చేస్తే వారిపై ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతూ వైసీపీ కి దగ్గరైంది. ఇక చంద్రబాబు , పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా ఎంతోమందిపై నోరు పారేసుకున్న ఈమె..ఇటీవల కూటమి సర్కార్ అధికారం లోకి రావడం తో కాస్త సైలెంట్ అయ్యింది. దీంతో శ్రీ రెడ్డి ని అంత మరచిపోయారు.
ఇక ఇప్పుడు మరోసారి తన నోటికి పనిచెప్పి వార్తల్లో నిలిచింది. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె రెచ్చిపోయింది. డిప్యూటీ సీఎం అని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్‌ను పచ్చి బూతులు తిడుతూ ట్వీట్ చేసింది. అది చూసిన మెగా ఫ్యాన్స్ ఆమె పై మండి పడుతున్నారు. ఆమె ఎలాంటి బూతులు అన్నదో మీరే ఈ కింది ట్వీట్ లో చూడండి.
Hinduthvam Peru addam pettukuni rajakeeyalu chese yedhava,christian ammayini pelli chesukunnappudu ee sanathana dharmanni ye Santha lo ammesaavra sannasi ??communist bhaavalu antav, dheekshalantav yemanna🙄🙄🙄matching vundha??asalu dheepam tho cigrette veliginchukunna vaadiki…
— Sri Reddy (@SriReddyTalks) September 24, 2024
Read Also : Tirumala Laddu Controversy : పాప ప్రక్షాళన పూజకు జగన్ సిద్ధం ..టీడీపీ కౌంటర్