Sri Reddy Emotional Letter : లోకేష్ అన్న నన్ను వదిలెయ్యండి..ప్లీజ్ అంటూ శ్రీ రెడ్డి లేఖ
Sri Reddy Emotional Letter : లోకేష్ అన్న (Lokesh Anna) నన్ను వదిలెయ్యండి..ఇకపై తాను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయను.. తనకు ఇష్టమైన దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని
- By Sudheer Published Date - 01:01 PM, Thu - 14 November 24

లోకేష్ అన్న (Lokesh Anna) నన్ను వదిలెయ్యండి..ఇకపై తాను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయను.. తనకు ఇష్టమైన దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, తనను క్షేమించండి.. వారం రోజులుగా తిండీ నిద్ర లేకుండా కుమిలిపోతున్న, తనతోపాటు తన కుటుంబ సభ్యులు వేల సంవత్సరాలకు సరిపడా క్షోభ అనుభవించారని, తనను వదిలివెయ్యండి ప్లీజ్ అంటూ శ్రీ రెడ్డి లేఖ (Sri Reddy Emotional Letter) రాసింది.
వైసీపీ నేతలు (YCP Leaders) , వైసీపీ సపోటర్స్ , వైసీపీ సోషల్ మీడియా సైన్యం..ఇలా వైసీపీ కి జై కొట్టిన వారంతా ఇప్పుడు వణికిపోతూ కాళ్ల బేరానికి వస్తున్నారు. అధికార మదంతో వైసీపీ నేతలు, వైసీపీ శ్రేణులు, ఆఖరికి వైసీపీ సోషల్ మీడియా వారు సైతం ఐదేళ్ల పాటు ఎన్ని అరాచకాలు..ఎన్ని దౌర్జన్యాలు..ఎన్ని హత్యలు..ఎన్ని అక్రమ కేసులు, సోషల్ మీడియా ట్రోల్స్ పెట్టి ఎంత బాధపెట్టారో తెలియంది కాదు. ఇక శ్రీ రెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు.
శ్రీ రెడ్డి (Sri Reddy)..సోషల్ మీడియా లో ఈమె గురించి తెలియని వారు ఉండరు. అప్పుడెప్పుడో తనకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తున్నారని..కనీసం మా సభ్యత్వం కూడా ఇవ్వడం లేదంటూ ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్నంగా నిరసన తెలిపి మీడియా చానెల్స్ ను తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత చిత్రసీమలో చాలామంది తనతో ఎఫైర్లు నడిపించారని చెప్పి పలువురి హీరోల పేర్లు , దర్శకులు , నిర్మాతల పేర్లు తెలిపి షాక్ ఇచ్చింది. ఈమె చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని..ఆమెను పట్టించుకోవద్దంటూ వారంతా డిసైడ్ కావడమే కాదు పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం తో హైదరాబాద్ నుండి చెన్నై కి మకాం మార్చేసింది. అప్పటి నుండి వైసీపీ కి సపోర్ట్ ఇస్తూ..జగన్ ఫై ఎవరైనా విమర్శలు , ఆరోపణలు చేస్తే వారిపై ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతూ వైసీపీ కి దగ్గరైంది. ఇక చంద్రబాబు , పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా ఎంతోమందిపై నోరు పారేసుకున్న ఈమె..ఇటీవల కూటమి సర్కార్ అధికారం లోకి రావడం తో కాస్త సైలెంట్ అయ్యింది. ఇక ఇప్పుడు కూటమి సర్కార్ అరెస్ట్ ల పర్వం మొదలుపెట్టడం తో శ్రీ రెడ్డి కి సీన్ అర్థమై క్షేమపణలు కోరుతూ తనను , తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దంటూ వేడుకుంటుంది.
జగన్ తిట్టమంటే బూతులు తిట్టాం… సజ్జల స్క్రిప్ట్ ఇచ్చి, మీ కుటుంబ సభ్యులని బూతులు తిట్టాంచాడు..మమ్మల్ని వదిలేయండి, జగన్, సజ్జల ని అరెస్ట్ చేయండి. లోకేష్ గారు, పవన్ గారు, అనిత గారు సారీ.. మమ్మల్ని వదిలేయండి. ఇకపై మీపై కానీ మీ కుటుంబ సభ్యులపై కానీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలే కాదు అసలు ఏమిమాట్లాడమని చెపుతూ వారం రోజుల క్రితం ఓ వీడియో ఒకటి విడుదల చేయగా..తాజాగా ఓ లెటర్ విడుదల చేసింది.
‘లోకేష్ అన్నా.. నేను పుట్టింది గోదావరి జిల్లా అయినా సరే.. పెరిగింది మొత్తం విజయవాడ. మా కుటుంబానికి విజయవాడతోనే ఎక్కువ అనుబంధం ఉంది.. అమరావతి రాజధాని కావడం మా ఇంట్లో వారికి కూడా సంతోషాన్నిచ్చింది.. విజయవాడలోని మా ఇంటి వ్యాల్యూ కూడా పెరిగింది.. మా కుటుంబ సభ్యులు కూడా టీడీపీకి ఓటు వేశారు.. కొన్ని విషయాల్లో ఎంత మెండిగా ఉంటారో అంత మంచితనం కూడా మీలో ఉంది.. మీకు నాతో వీడియోలో క్షమాపణలు చెప్పించింది కూడా మా కుటుంబ సభ్యులే.. మీతో డైరెక్టుగా వీలైతే మాట్లాడమని వారు చెప్పారు.. అయితే నాకు అంత స్ధాయిలేదు.. అందుకే ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నాను’అని తెలిపింది.
‘నేను మీ పార్టీని, కార్యకర్తలను, జనసేన వీర మహిళలను వారి కుటుంబ సభ్యులకు ఇంతకు ముందే క్షమాపణలు చెప్పాను.. నేను చాలా పరుషంగా అనేకసార్లు మాట్లాడాను.. అందుకే నేనే మరోసారి క్షమాపణలు చెబుతున్నా.. గత పదిరోజులుగా డిస్కషన్‌లు వాటిలో పెడుతున్న కామెంట్స్ చూస్తే నేను ఎంత మంది మనోభావాలను దెబ్బతీశానో అర్ధం అవుతోంది.. వెంకటేశ్వరస్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెపుతున్నా జుగుప్సాకరంగా మట్లాడి తప్పుచేశాను. చంద్రబాబునాయుడు, లోకేష్ , వారి కుటుంబ సభ్యులకు, హోంమినిష్టర్‌కు, ఆంధ్రజ్యోతి, ఐటిడిపీ, టిడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకు సారీ .. జనసేన మీడియా, వీర మహిళలు, సోషల్ మీడియాకి, పీకేకు సారీ.. మీ అందరూ పెద్దమనసుతో మీ తెలుగు అమ్మాయిని క్షమించండి’ అంటూ లేఖ రాసింది. ప్రస్తుతం ఈ లేఖ వైరల్ గా మారింది.
Please anna begging you🙏 save me pic.twitter.com/tXxKPIjutl
— Sri Reddy (@SriReddyTalks) November 14, 2024
Read Also : Tollywood Stars : మాల్దీవుల్లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్స్