YSR Sampoorna Poshana Kit : జగన్ పౌష్టికాహారం ప్యాకెట్లో పాము కళేబరం..
- By Sudheer Published Date - 04:21 PM, Wed - 11 October 23

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పంపిణీ చేసే వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్ (YSR Sampoorna Poshana Kit) లో పాము కళేబరం (Snake carcass found) కనిపించడం భయబ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటన చిత్తూరు (Chittoor) జిల్లా బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్ అంగన్ వాడీ కేంద్రంలో వెలుగుచూసింది.
We’re now on WhatsApp. Click to Join.
మానస (Pregnant Women Manasa) అనే గర్భిణి.. ఆ అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చిన ప్యాకెట్ తీసుకుని సీమంతం నిర్వహించుకునేందుకు తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఖర్జూరాల ప్యాకెట్ విప్పి చూడగా అందులో పాము కళేబరం కనిపించింది. ఈ దృశ్యంతో అవాక్కైన మహిళ అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రెడ్డి కల్యాణి సాయంతో సీడీపీఓ వాణిశ్రీదేవికి సమాచారం అందించింది. కాగా, ప్యాకెట్లో పాము కళేబరం ఉన్న మాట వాస్తవమేనని సీడీపీఓ అంగీకరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభుత్వం అందించే కిట్ లో పాము కళేబరం ఉన్న విషయం తెలిసిన స్థానికులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. పౌష్టికాహారం విషయంలో ఇంత అశ్రద్ధగా ఉంటే.. బాలింతలు, చిన్నారులు, గర్బిణుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
Read Also : Anasuya Bharadwaj : వైట్ శారీ స్టన్నింగ్ లుక్స్ అనసూయ అదుర్స్