Avanigadda : జనసేన – టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే దాడి
తన ఇంటినే ముట్టడిస్తారా అంటూ.. ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్ర తీసుకుని జనసేన టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు.
- Author : Sudheer
Date : 20-10-2023 - 5:31 IST
Published By : Hashtagu Telugu Desk
కృష్ణా జిల్లా అవనిగడ్డ (Avanigadda )లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని..వెంటనే హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జనసేన (Janasena) – టీడీపీ (TDP) కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు (Simhadri Ramesh Babu) ఇంటిని ముట్టడించారు. తన ఇంటినే ముట్టడిస్తారా అంటూ.. ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్ర తీసుకుని జనసేన టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీ ఎమ్మెల్యే తీరుపై జనసేన, టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు కూడా ఎమ్మెల్యే వ్యవహారంపై మండిపడుతున్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించలేని ఎమ్మెల్యే వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సీఎం జగన్ అవనిగడ్డ వచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.93 కోట్ల వరాలు కురిపించి నేటికీ సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో హామీల అమలు ఎప్పుడు..? అవనిగడ్డ – కోడూరు రోడ్డు నిర్మాణం, పాత ఎడ్లలంక బ్రిడ్జి, డయాలసిస్ సెంటర్, పట్టణంలో సీసీ డ్రైన్ నిర్మాణం, దివిసీమ కరకట్ట మరమ్మతులు ఇవ్వన్నీ ఎప్పుడు చేస్తారంటూ నేడు జనసేన – టీడీపీ శ్రేణులు .ధర్నా కు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు.
Read Also : Bhagavanth Kesari: భగవంత్ కేసరి.. కలెక్షన్ల సునామీ, మొదటి రోజు ఎంతవసూలు చేసిందంటే