SI Hall Tickets : ఎస్సై తుది పరీక్షల హాల్‌టికెట్లు రిలీజ్.. లాస్ట్ డేట్ అక్టోబరు 12
SI Hall Tickets : ఆంధ్రప్రదేశ్ లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది పరీక్షల హాల్ టికెట్లను ఇవాళ పోలీసు నియామక బోర్డు విడుదల చేసింది.
- Author : Pasha
Date : 06-10-2023 - 11:02 IST
Published By : Hashtagu Telugu Desk
SI Hall Tickets : ఆంధ్రప్రదేశ్ లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది పరీక్షల హాల్ టికెట్లను ఇవాళ పోలీసు నియామక బోర్డు విడుదల చేసింది. అక్టోబరు 14, 15 తేదీల్లో తుది పరీక్షలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎస్ఎల్పీఆర్బీ) అధికారిక వెబ్‌సైట్‌లో ఈ హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఈ నెల 12 వరకు అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌లో సమస్యలు వస్తేు హెల్ప్‌లైన్ నెంబరు 9441450639, 9100203323 లేదా ఈమెయిల్ mail-slprb@ap.gov.inలో సంప్రదించవచ్చు.
We’re now on WhatsApp. Click to Join
ఎస్ఐ అభ్యర్థులకు అక్టోబరు 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1 ఎగ్జామ్ ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఎగ్జామ్ జరుగుతుంది. ఇక అక్టోబరు 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-3 ఎగ్జామ్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-4 ఎగ్జామ్ జరుగుతాయి. ఎస్‌ఐ తుది పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1 ఇంగ్లిష్ (డిస్క్రిప్టివ్), పేపర్-2 తెలుగు/ఉర్దూ (డిస్క్రిప్టివ్), పేపర్-3 అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్), పేపర్-4 జనరల్ స్టడీస్(ఆబ్జెక్టివ్) ఉంటాయి. పేపర్-1, పేపర్-2 కేవలం (SI Hall Tickets) అర్హత పరీక్షలే. ఫిజికల్ ఈవెంట్లలో మొత్తం 31,193 మంది అభ్యర్థులు సాధించారు. వీరిలో పురుషులు-27,590 మంది, స్త్రీలు-3603 మంది పరీక్షకు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.