Shyamala : ట్రోలింగ్ పై శ్యామల ఇలా రియాక్ట్ అవుతుందని ఎవరు ఉహించి ఉండరు..!!
Shyamala : ఈ ట్రోల్స్ ను హాస్యస్పదంగా తీసుకున్న శ్యామల.. ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చింది.
- By Sudheer Published Date - 07:51 PM, Sun - 16 February 25

సోషల్ మీడియా వేదికగా గత కొద్దిరోజులుగా వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల(Shyamala )పై ట్రోలింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె సినీ, టీవీ రంగాల్లోకి రాకముందు కొన్ని వేదికలపై చేసిన డ్యాన్సుల వీడియోలు, ఫోటోలు బయటకు రావడంతో ట్రోలర్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. రికార్డింగ్ డ్యాన్సులు, వేదికలపై డ్యాన్సులు అంటూ వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్ పై శ్యామల తనదైన శైలిలో స్పందించారు.
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందుకు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడికి గాయం?
ఈ ట్రోల్స్ ను హాస్యస్పదంగా తీసుకున్న శ్యామల.. ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చింది. “మీరు నాపై చూపించిన అపారమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అంటూ తన సందేశాన్ని షేర్ చేశారు. తన చిన్ననాటి నుంచి కుటుంబం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేసుకుంటూ, తన గత జీవితాన్ని తెరపైకి తీసుకువచ్చిన ట్రోలర్లకు ధన్యవాదాలు తెలిపారు. తన బాల్య జీవితంలోని కొన్ని మధురమైన జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసేందుకు ట్రోలర్లు చేసిన ఈ ప్రచారం ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు. “నా చిన్ననాటి ఫొటోలు వెతికి, నా జీవితంలోని ఆ అనుభవాలను మళ్లీ గుర్తు చేసే విధంగా మీరూ భాగస్వాములు కావడం నాకు ఆనందంగా ఉంది” అంటూ సున్నితంగా స్పందించారు. ట్రోలింగ్‌ను ఎదుర్కొనడంలో ఆమె తీరును మెచ్చుకునేలా ఆమె సమాధానం ఉండడం గమనార్హం.
తన కెరీర్ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న శ్యామల, ఈ ట్రోలింగ్‌ను తేలిగ్గా తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకున్న అభిమానులు, ఆమె తీరును ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. “ట్రోలింగ్‌ను ఎదుర్కొనే మీ ధైర్యం స్ఫూర్తిదాయకం, మీ సమాధానం చాలా స్మార్ట్‌గా ఉంది” అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.