Sankranti Effect : టోల్‌ప్లాజాల వద్ద మొదలైన ట్రాఫిక్ జాం..
- By Sudheer Published Date - 09:13 PM, Thu - 11 January 24

సంక్రాంతి (Sankranti ) వచ్చిందంటే హైదరాబాద్ (Hyderabad) సగం ఖాళీ అవుతుంది..బ్రతుకుదెరువు కోసం ఎక్కడెక్కడో వారు హైదరాబాద్ నగరానికి వస్తారు..రేయి పగలు కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ పరుగులుపెడుతుంటారు. ఏడాది అంత బిజీ బిజీ గా గడుపుతూ..సంక్రాంతి సమయంలో మాత్రం సొంతర్లకు వెళ్లి కష్టాన్ని మరచిపోయి..కుటుంబ సభ్యులు , బంధువులు , పల్లె వాసులతో హాయిగా గడుపుతుంటారు. ఇందుకోసం నాల్గు రోజుల ముందే సొంతర్లకు బయలుదేరతారు. ముఖ్యంగా ఏపీ వాసులు..ఏపీలో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అక్కడ జరిగే కోడి పందేలు చూసేందుకు ఇతర రాష్ట్రాల వారు సైతం ఏపీకి పయనం అవుతారు. దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకుంటుంది. ఏడాది కూడా అలాగే రద్దీ మొదలైంది.
We’re now on WhatsApp. Click to Join.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాలు కార్లు ఇతర వాహనాలతో రద్దీగా మారాయి. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఈరోజు మధ్యాహ్నం నుంచి వాహనాల తాకిడి ఎక్కువైంది. రేపటి నుండి ట్రాఫిక్ మరింత పెరిగే ఛాన్స్ ఉండడం తో జీఎంఆర్ సిబ్బంది విజయవాడ వైపు వెళ్లే.. వాహన లైన్ల సంఖ్య పెంచారు. అయినప్పటికీ రద్దీ తగ్గడం లేదు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. ఫాస్ట్‌ట్యాగ్ ఉన్నప్పటికీ వాహనాలు ఎక్కువగా వస్తుండటంతో నెమ్మదిగా కదులుతున్నాయి. అక్కడే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసి పంపిస్తుండటంతో మరింత జాప్యం జరుగుతోంది.
మరోపక్క APSRTC , TSRTC లు పండుగకు స్వగ్రామాలకు వెళ్లే వారికి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్(Hyderabad) నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు అదనంగా వెయ్యి సంక్రాంతి స్పెషల్ బస్సులను నడపాలని ఏసీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. వాస్తవానికి ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్(Sankranti) కింద 6,725 బస్సులను నడపాలని నిర్ణయింది. అందులో హైదరాబాద్ నుంచి సంక్రాంతికి ముందు 1,600 బస్ సర్విసులు, సంక్రాంతి తరువాత 1,500 బస్ సర్విసులు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అదనంగా మరో వెయ్యి బస్సులను నడిపేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, అమలాపురం, కర్నూలు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విశాఖపట్నాలకు అదనపు వెయ్యి బస్సు సర్వీసులు నడుపనున్నట్లు చెప్పారు. అలాగే బెంగళూరు, చెన్నైల నుంచి తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Read Also : Mushroom Kebab: ఎంతో స్పైసీగా ఉండే మష్రూమ్ కబాబ్.. ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోండిలా?