RK Roja : మంచి చేసి ఓడిపోయారట..మాజీ మంత్రి రోజా ట్వీట్
చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల.. కానీ.. మంచి చేసి ఓడిపోయాం
- Author : Sudheer
Date : 14-06-2024 - 7:42 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో కూటమి భారీ విజయం సాధించడం..కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం..నూతన సీఎం గా చంద్రబాబు (Chandrababu) బాధ్యతలు చేపట్టడం..24 మంది పలు శాఖల మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం..కీలక హామీల అమలు ఫై సంతకాలు పెట్టడం ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. సీఎం గా మరోసారి చంద్రబాబు తన మార్క్ కనపరుస్తూ..అధికారులను పరుగులుపెట్టిస్తున్నాడు..అయినప్పటికీ రోజా మాత్రం ఇంకా తమ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేశామని చెప్పడం అందర్నీ నవ్వు తెప్పిస్తుంది.
వై నాట్ 175 అంటూ భజన చేసిన వైసీపీ బ్యాచ్ కి ప్రజలు బుద్ది చెప్పారు. 175 కు ముందు 17 కూడా ఇవ్వలేదు. కేవలం 11 సీట్లతో సరిపెట్టారు. అయినప్పటికీ ఆ పార్టీ నేతల్లో మార్పు రావడం లేదు. తాజాగా మాజీ మంత్రి , నగరి మాజీ ఎమ్మెల్యే రోజా (EX Minister Roja) సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల.. కానీ.. మంచి చేసి ఓడిపోయాం! గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం..ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం! అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. మీరు చేసిన మంచి భరించలేక..తట్టుకోలేక 11 సీట్లు ఇచ్చాం అంటూ కౌంటర్ వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఎన్నికల ముందు నుండే నగరి లో రోజా ఈసారి ఓటమి ఖాయమని చెపుతూ వచ్చారు. అంత భావించినట్లే రోజా ఘోర ఓటమి చవిచూసింది. ఇదిలా ఉంటె వైసీపీ ప్రభుత్వంలో క్రీడాశాఖ మంత్రిగా ఉన్న రోజా ఆడుదాం ఆంధ్ర పేరుతో రూ.100 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని మాజీ కబడ్డీ క్రీడాకారుడు ఆర్‌డీ ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేసారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న శాప్ ఎండీలు, శాప్ ఉన్నతాధికారులపై విచారణ జరపాలని కోరామన్నారు.
చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల!
కానీ.. మంచి చేసి ఓడిపోయాం!
గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం!
ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!🔥🔥 pic.twitter.com/rZgit4c5Gq— Roja Selvamani (@RojaSelvamaniRK) June 14, 2024
Read Also : Hema : బెయిల్ పై బెంగళూరు జైలు నుంచి విడుదలైన నటి హేమ