HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Roja Comments On Nara Lokesh You Are A Uncle

Roja Vs Lokesh: పొలిటికల్ హీట్.. డైమండ్ రోజా, లోకేష్ అంకుల్!

డైమండ్ పాప అని పిలవడంపై మంత్రి రోజా నారా లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Author : Balu J Date : 01-02-2023 - 5:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lokesh And Roja
Lokesh And Roja

యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల మంత్రి రోజాను ఉద్దేశించి డైమండ్ పాప అని పిలవడంపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ నువ్వొక అంకుల్ అంటూ మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ తో కుమ్మక్కై జగన్ ను వేధించారని గుర్తుచేశారు. ఆ వేధింపులను లెక్కచేయకుండా జగన్ ఎంతో ఆత్మస్థైర్యంతో పాదయాత్ర ప్రారంభించి ప్రజల కష్టాలను తెలుసుకున్నారన్నారు.

పాదయాత్ర ద్వారా తెలుసుకున్న ప్రజల కష్టాలను అధికారంలోకి వచ్చిన తర్వాత జ‌గ‌న్‌ తీరుస్తున్నారన్నారు. అందుకే తమకు ఓటు వేయాలని ప్రజలను ధైర్యంగా అడుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని రోజా ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి రాష్ట్రానికి ఏం చేశారో, మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పకుండానే పప్పు నాయుడు పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలను దోచుకుని హైదరాబాద్ లో దాచుకున్నాడని, మళ్లీ ఆయనను సీఎం చేసేందుకు లోకేష్ ఆరాటపడుతున్నారన్నారు. చంద్రబాబు తనకు అవసరం ఉన్నప్పుడల్లా నందమూరి కుటుంబాన్ని వాడుకుంటారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోరన్నారు. అది నందమూరి కుటుంబం గుర్తించలేకపోతోందన్నారు. లోకేష్ పాదయాత్రలో సెక్యూరిటీ, వాలంటీర్లే ఎక్కువగా కనిపిస్తున్నారని, వాళ్ళు లేకపోతే కనీసం పదిమంది కూడా లోకేష్ పాదయాత్రలో కనిపించరని ఎద్దేవా చేశారు. లోకేష్ ది యువ గళం కాదని, ఒంటరిగళం అని అన్నారు. తనని డైమండ్ పాప అని లోకేష్ సంభోదించడంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లోకేష్ అంకుల్’ అంటూ పిలుస్తూ సెటైర్లు వేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • hard comments
  • nara lokesh
  • RK Roja

Related News

Nara Lokesh Blackbuck

Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'నైపుణ్యం' (Skill) పోర్టల్‌ను తీసుకువస్తోంది. ఇప్పటికే 25 కీలక రంగాలకు సంబంధించిన డేటా ఇంటిగ్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.

  • Tadapatla Ratnabai Dies

    Tadapatla Ratnabai : మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి ఇకలేరు

  • Vaali Lokesh

    Medaram Jathara Kova Bun Controversy : కోవా బన్ వ్యాపారికి నారా లోకేష్ భరోసా !!

Latest News

  • అంబాజీ మాత ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.50 కోట్ల భారీ విరాళం

  • అకౌంట్ బ్యాన్ అయినప్పటికీ అన్వేష్ తలపొగరు ఏమాత్రం తగ్గలేదు..బత్తాయిలకు నరకం చూపిస్తాను అంటూ కామెంట్స్

  • Trump Warning : ట్రంప్ వార్నింగ్ తో మార్కెట్ షేక్.. $100 దిశగా ఆయిల్ ధరలు?

  • India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

Trending News

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd