Road Accident in Chittoor District : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..8 మృతి
8 Dead and Several Injured after Lorry and Bus Collided in Chittoor : రెండు లారీలు బస్సు (BUS) ను ఢీ కొట్టడం తో స్పాట్ లో ఎనిమిది మంది చనిపోయారు.
- By Sudheer Published Date - 06:23 PM, Fri - 13 September 24

8 Dead and Several Injured after Lorry and Bus Collided in Chittoor : చిత్తూరు జిల్లాలో(Chittoor District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. రెండు లారీలు బస్సు (BUS) ను ఢీ కొట్టడం తో స్పాట్ లో ఎనిమిది మంది చనిపోయారు. పలమనేరు నియోజకవర్గం.. బంగారుపాళ్యం మండలం మొగలి కనుమ రహదారిఫై ఈ ప్రమాదం జరిగింది. సప్తగిరి ఆర్టీసీ బస్సు చిత్తూరు నుంచి పలమనేరు(Palamaner) వెళ్తుండగా.. పలమనేరు నుంచి ఇనుప రాడ్స్ లోడ్ తో వస్తున్న లారీ(Lorry) ఒక్కసారిగా అదుపు తప్పి బస్సు ను ఢీ కొట్టగా..అదే సమయంలో వెనుక నుండి మరో లారీ బస్సు ను ఢీ కొట్టింది. దీంతో రెండు లారీల మధ్య బస్సు నుజ్జునుజ్జయింది. ఆర్డీసీ బస్సు డ్రైవర్‌తో పాటు ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మరో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల కోసం చిత్తూరు తరలించారు.
ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోవడం బాధాకరమని, గాయపడిన వారికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రవాణాశాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ (Minister Lokesh) సూచించారు. ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక ఈ ప్రమాదం కారణంగా ఆ రూట్ లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.
Read Also : CM Revanth Reddy : ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్స్ : అధికారులకు సీఎం ఆదేశాలు