Jagan Vs Employees : ఉద్యోగులు,జగన్ సర్కార్ మధ్య అగాధం
ఏపీ సర్కార్, టీచర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా ఉంది. సీపీఎస్ రద్దు చేయకపోగా, టైమ్ కు స్కూల్స్ రమ్మంటూ ఫేస్ రిగగ్నైజేషన్ పద్ధతిని సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టారు.
- Author : CS Rao
Date : 06-09-2022 - 4:32 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సర్కార్, టీచర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా ఉంది. సీపీఎస్ రద్దు చేయకపోగా, టైమ్ కు స్కూల్స్ రమ్మంటూ ఫేస్ రిగగ్నైజేషన్ పద్ధతిని సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టారు. స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారన్న ఫీలింగ్ కు టీచర్ల వచ్చేశారని తెలుస్తోంది. అందుకే, మిలియన్ మార్చ్ దిశగా చురుగ్గా ముందుకు కదులుతున్నారు.
సీపీఎస్ రద్దుకు బదులుగా జీపీఎస్ ద్వారా ఉద్యోగులకు లబ్ది చేకూర్చాలని జగన్ సర్కార్ అనుకుంటోంది. కానీ, సీపీఎస్ రద్దు మినహా మరో ప్రత్యామ్నాయం అవసరంలేదని టీచర్లు, ప్రభుత్వం ఉద్యోగులు తెగేసి చెబుతున్నారు. అందుకే, మంగళవారం మంత్రి బొత్సా సత్యానారాయణ ఉద్యోగులతో జరిగిప చర్చలు మరోసారి విఫలం అయ్యాయి.
బొత్స ఆహ్వానం మేరకు ఉద్యోగ సంఘాల నేతలు మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లినప్పటికీ ఫలితం లేదు.
జీపీఎస్ ను అమలు చేస్తామని మంత్రుల కమిటీ ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు ఇప్పటికే నో చెప్పిన ఉద్యోగ సంఘాలు మంగళవారం జరిగిన చర్చల్లోనూ తిరస్కరించారు. అర్ధాంతరంగా చర్చల నుంచి బయటకు వచ్చారు. గ్యారెంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్)ను ప్రవేశపెడతామని ప్రభుత్వం తెగేసి చెబుతోంది. అయితే ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) మినహా మరే ఇతర పెన్షన్ స్కీం ఆమోదయోగ్యం కాదని ఉద్యోగ సంఘాలు తేల్చాశాయి.