RGV: ఆ జన సందోహాం చూసి.. నాకు చలి జ్వరమొచ్చింది!
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు గురువారం నిర్వహించిన ‘చలో విజయవాడ’ ఆందోళన కార్యక్రమం ఎంత విజయవంతం అయిందో మనం చూశాం.
- By Hashtag U Published Date - 09:50 AM, Fri - 4 February 22

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు గురువారం నిర్వహించిన ‘చలో విజయవాడ’ ఆందోళన కార్యక్రమం ఎంత విజయవంతం అయిందో మనం చూశాం. ఇంకా చెప్పాలంటే అమరావతి ఉద్యమానికి మించి ఇది సక్సెస్ అయింది. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకుని లక్షలాదిమంది ఉద్యోగులు విజయవాడ తరలివచ్చి తమ సత్తా చాటారు. అసలు ఇంతగా ఉద్యోగులు చేపట్టిన ఈ ‘చలో విజవాడ’ సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇకపోతే, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘చలో విజయవాడ’ పైనా తనదైన శైలిలో ట్విటర్ వేదికగా స్పందించారు.
ఉప్పెనలా తరలి వచ్చిన ఉద్యోగుల ఫొటోలను ఆర్జీవీ ట్వీట్ చేశారు. ప్రభుత్వం సంగతేమో కానీ ఆ జనాన్ని చూసి తనకు మాత్రం భయంతో చలి జ్వరం వచ్చిందని రాసుకొచ్చారు. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాదిమంది ఉద్యోగులు రోడ్డుకెక్కడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. అసలు ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా..? అనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. గర్జించాల్సిన సమయం వచ్చినప్పుడు మౌనంగా ఉండడం పిరికితనం అవుతుందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఓ సలహా కూడా ఇచ్చారు రాంగోపాల్ వర్మ. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్స్, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
It is a shock to me that so many lakhs of government employees can come on to the roads to protest against their own government..I doubt if this ever happened anywhere in the world ever pic.twitter.com/n4adBosbca
— Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2022
Related News

Durga Temple : ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేసిన అధికారులు
భారీ వర్షాల దృష్ట్యా విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయ ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఇంద్రకీలాద్రి