Lokesh : జాతీయ ప్రధాన కార్యదర్శిగా తప్పుకుంటా – నారా లోకేష్
Lokesh : తన దృష్టి పూర్తిగా పార్టీ బలోపేతం చేయడంపైనే ఉందని, వ్యక్తిగత లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వబోనని స్పష్టం చేశారు
- By Sudheer Published Date - 01:02 PM, Mon - 27 January 25

‘మిమ్మల్ని సీఎంగా చూస్తామా? డిప్యూటీ సీఎంగా చూస్తామా?’ అన్న మీడియా ప్రశ్నపై మంత్రి లోకేశ్ (Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీ ఏ బాధ్యత అప్పగించినా కష్టపడి పనిచేసేందుకు సిద్ధమని తెలిపారు. తన దృష్టి పూర్తిగా పార్టీ బలోపేతం చేయడంపైనే ఉందని, వ్యక్తిగత లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వబోనని స్పష్టం చేశారు. పార్టీకి చెడ్డపేరు వచ్చేలా పనులు చేయనని, చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో టిడిపిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
AP Govt : గ్రామ, సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్ షాక్
అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో నుంచి ఈసారి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపి షాక్ ఇచ్చాడు. ఈ నిర్ణయం తన వ్యక్తిగత అభిప్రాయమని, ఒక వ్యక్తి ఒకే పదవిలో మూడు పర్యాయాలు కొనసాగడం సరైన పద్దతి కాదని వ్యాఖ్యానించారు. లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో కొత్త వాదనలు రేకెత్తిస్తోంది. ప్రత్యేకంగా యువతను ప్రోత్సహించేందుకు, పార్టీలో మరింత ప్రజాస్వామ్య పద్ధతులను తీసుకురావడమే లక్ష్యంగా లోకేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. లోకేశ్ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలు, అనుచరుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి.
పార్టీలో కొత్త తరం నాయకత్వం రావడం ద్వారా, టిడిపి వైఖరి ప్రజలకు మరింత చేరువవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకే పదవిలో దీర్ఘకాలం కొనసాగడం వల్ల నాయకత్వంలో శక్తి తగ్గుతుందని భావించడం, లోకేశ్ దృష్టి విశిష్టతకు నిదర్శనంగా చెబుతున్నారు. ఓవరాల్ గా నారా లోకేశ్ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో కీలక మలుపు గా మారబోతుంది. ఆయన తన పదవి నుంచి తప్పుకోవడం, పార్టీకి కొత్త నాయకత్వం వచ్చే అవకాశం కల్పించడం టిడిపి భవిష్యత్తు కోసం ప్రాధాన్యత కలిగిన పరిణామంగా చెప్పవచ్చు.