Atchutapuram : రియాక్టర్ పేలుడు.. 6 కు చేరిన మృతుల సంఖ్య
అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతున్నాయి
- By Sudheer Published Date - 07:12 PM, Wed - 21 August 24

అనకాపల్లిలోని అచ్యుతాపురం (Atchutapuram ) ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన (Reactor Explosion) ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం కాస్త తప్పింది. ప్రమాదం కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టూ పొగలు అల్లుకున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి, స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై హోం మంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి.. ఫార్మా ప్రమాదంపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోపక్క పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. అలాగే ఘటనపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉంటె కంపెనీ వద్ద కార్మికుల కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని డ్యూటీలో ఉన్న సిబ్బంది వివరాలు బయట పెట్టాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Read Also : EC : హర్యానాలో ఉద్యోగ నియమాకాలపై ఈసీ ఆదేశాలు