Ambati Rayudu : రాయుడు..నువ్వు ఇక మారవా..?
- By Sudheer Published Date - 08:55 PM, Wed - 10 January 24

నువ్వు ఇక మారవా..ఈ వర్డ్ చాలామంది ప్రతి రోజు ఎక్కడో ఓ చోట వాడుతూనే ఉంటారు..ఏరా…ఇక నువ్వు మారవా..? అంటూనే ఉంటారు. ఇప్పుడు అంబటి రాయుడు (Ambati Rayudu) విషయంలో కూడా అలాగే అంటున్నారు. ఎందుకంటే మనోడి ప్రవర్తన ఆలా ఉంది. ఎక్కడ నిలకడలేని స్వభావం తో అందరి చేత అబ్బే..ఇక మారాడు అనిపించుకుంటున్నాడు. కేవలం క్రికెట్ లోనే కాదు ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలాగే చేస్తున్నాడు.
రంజీ ఆడే టైమ్‌లో రాయుడు బీసీసీఐకి ఎదురుతిరగడం తో ఆయన ఫై వేటు వేసింది.. ఆ తర్వాత 2009లో బీసీసీఐ క్షమాభిక్ష పెట్టడంతో.. మళ్లీ దేశవాళీ క్రికెట్‌లోకి వచ్చాడు. ఇక రంజీల్లో అతడు మారని జట్టు లేదు. రాజకీయాలు అంటూ ఒకసారి.. అడ్జస్ట్ కాలేకపోతున్నానంటూ ఇంకోసారి.. ఇలా చాలా జట్లు మారుతూవచ్చాడు. 2001 నుంచి 2005వరకు హైదరాబాద్ టీం కు ఆడిన రాయుడు.. తర్వాత ఆంధ్రాకు.. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు.. 2010 నుంచి 2016 వరకు బరోడాకు, తర్వాత విధర్బ తరఫున ఆడాడు. ఇలా ఆయనకు ఏమనిపిస్తే అది చేస్తూ ఎక్కడ నిలకడ లేకుండా అయోమయానికి గురయ్యాడు. ఇక ఇప్పుడు రాజకీయాల్లో అలాగే చేస్తున్నాడు.
మొన్నటికి మొన్న జగన్ (Jagan) ఆశయాలు నచ్చాయి..నా హీరో ఆయన..ప్రజలకు సేవ చేయాలంటే అది జగన్ అడుగుజాడల్లోనే చేయగలను అంటూ సినిమా డైలాగ్స్ చెప్పి..జగన్ సమక్షంలో ఫ్యాన్ కిందకు వెళ్లాడు..రాయుడు చేరిక తో వైసీపీ (YCP) శ్రేణులతో పాటు జగన్ అభిమానులు సైతం సంబరపడ్డారు. ఆ సంబరం కాస్తయినా లేకుండా పది రోజులు గడవకముందే వైసీపీ కి రాజీనామా చేస్తున్న అని చెప్పి షాక్ ఇచ్చాడు.
We’re now on WhatsApp. Click to Join.
అదేంటి అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఇప్పుడే రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకోవడం లేదు ..కొంత టైం తీసుకుంటా అని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. పోనిలే క్రికెట్ లోనైనా రాణిస్తాడు కదా అని ఆయన అభిమానులతో పాటు రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. మరికొంతమంది అధిష్టానానికి, ఇతనికి మధ్య ఎక్కడ చెడిందో.. లేదంటే నిజంగానే క్రికెట్ కోసం రాజకీయాలు వద్దనుకుంటున్నాడో..ఏమోలే అని అనుకున్నారో లేదో వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో కలిసి షాక్ ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ ను కలవడం తో ఇక రాయుడు విషయంలో ప్రజలంతా ఒకటి ఫిక్స్ అయ్యారు. అదేంటి అంటే వైసీపీ టికెట్ ఇవ్వనందుకు బయటకు వచ్చాడు..ఇప్పుడు జనసేన టికెట్ ఇస్తా అని హామీ ఇచ్చినందుకు జనసేన (Janasena) లో చేరబోతున్నాడని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ప్రజలకు సేవ చేయాలంటే కేవలం రాజకీయాలే కాదు ఎన్నో రకాలుగా కూడా సేవ చేయొచ్చు..అంతే తప్ప రాజకీయాలతో అనేది తప్పు అని అంత చెపుతున్నారు. మరి జనసేన తోనైనా చివరి వరకు ఉంటాడో..లేక ఎన్నికలు పూర్తి కాగానే మ్యాచ్ ఉందని చెప్పి బై బై చెపుతాడో చూడాలి.
Read Also : Praveen Kumar: ధోనీ , కోహ్లీ, సచిన్ పై మాజీ క్రికెటర్ కామెంట్స్