Rajahmundry : బయటేమో తిరుమల వెంకన్న..లోపలేమో నాన్ వెజ్ వంటకాలు..హోటల్ పై భక్తుల ఆగ్రహం
Rajahmundry : హోటల్ బయట గర్భగుడి, బంగారు వాకిలి, జయ-విజయులు, కులశేఖర పది వంటి నిర్మాణ శైలి స్పష్టంగా కనిపించడంతో భక్తులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు
- Author : Sudheer
Date : 01-07-2025 - 12:54 IST
Published By : Hashtagu Telugu Desk
రాజమండ్రి జాతీయ రహదారి(Rajahmundry-Vizag Highway)పై “రాయుడు మిలిటరీ హోటల్” (Rajahmundry Rayudu Military Hotel) పేరుతో ఒక నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్‌ను తిరుమల శ్రీవారి ఆలయ నమూనాలో నిర్మించటం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. హోటల్ బయట గర్భగుడి, బంగారు వాకిలి, జయ-విజయులు, కులశేఖర పది వంటి నిర్మాణ శైలి స్పష్టంగా కనిపించడంతో భక్తులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థాన శైలిని నకిలీగా అనుకరించి మాంసాహార వ్యాపారానికి వాడటం హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిన చర్యగా పేర్కొంటున్నారు.
Raashi khanna; అలాంటి సినిమాలే నాకు ఇష్టం..రాశి ఖన్నా సెన్సేషన్
జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. “తిరుమల ఆలయం లక్షలాది మంది భక్తుల ఆస్తిక భావనకు ప్రతీక. అలాంటి పవిత్ర క్షేత్ర నమూనాతో మాంసాహార హోటల్ ఏర్పాటు చేయడం హిందూ ధర్మాన్ని అవమానపరచడమే” అని పేర్కొన్నారు. ఈ ఘటనపై టీటీడీ ఈవో శ్యామలరావు, చైర్మన్ బీఆర్ నాయుడికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హోటల్‌కు ఎలా అనుమతులు ఇచ్చారో అనే కోణంలో అధికారులు విచారణ ప్రారంభించారు. 48 గంటల్లోపూ ఆలయ నమూనాను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
Physical Harassment : నల్గొండలో దారుణం.. మహిళపై అత్యాచారం చేసిన ఆర్ఎంపీ
ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల్లో ఉన్న భక్తుల నుంచి కూడా ఫిర్యాదులు రావడం, హోటల్ యాజమాన్యం తక్షణమే నిర్మాణాన్ని తొలగించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. పలు హిందుత్వ సంఘాలు, స్థానిక భక్తులు ఈ వ్యవహారంపై అధికారుల నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో, అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో అన్నది గమనించాల్సిన అంశంగా మారింది.