HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rahul Satires On Babu Jagan Pawan

Kadapa : BJP అంటే బాబు, జగన్, పవన్ – రాహుల్

రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతం.. కాంగ్రెస్ సిద్థాంతమన్నారు. సామాజిక న్యాయ కోసం, పేదల కోసం వైఎస్సార్ రాజకీయం చేశారన్నారు. కానీ ఏపీలో ఇప్పుడు ఆ రాజకీయం లేదన్నారు

  • Author : Sudheer Date : 11-05-2024 - 4:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Gandhi Speech In Kada
Rahul Gandhi Speech In Kada

లోక్ సభ (Lok Sabha) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)..కడప లో పర్యటించారు. కడప కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైస్ షర్మిల (Ys Sharmila) కు మద్దతుగా ఆయన ప్రచారం చేసారు. ముందుగా రాహుల్ హెలికాప్టర్‌లో ఇడుపులపాయ చేరుకొని అక్కడ YSR ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. అనంతర కడప లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ..వైఎస్సార్ కేవలం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికి ఆదర్శమన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితోనే తాను భారత్ జోడో యాత్రను చేపట్టినట్లు చెప్పుకొచ్చారు. పాదయాత్ర చేసినప్పుడు ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకోవచ్చని వైఎస్సార్ తనతో చెప్పారన్నారు. రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతం.. కాంగ్రెస్ సిద్థాంతమన్నారు. సామాజిక న్యాయ కోసం, పేదల కోసం వైఎస్సార్ రాజకీయం చేశారన్నారు. కానీ ఏపీలో ఇప్పుడు ఆ రాజకీయం లేదన్నారు. బీజేపీ బీ టీమ్ నడిపిస్తోందని.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని , ఈ ముగ్గురి రిమోట్‌ కంట్రోల్‌ మోడీ చేతిలోనే ఉందని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మోడీ చేతిలో సీబీఐ, ఈడీ ఉన్నందునే ఈ ముగ్గురి కంట్రోల్‌ ఆయన చేతిలో ఉందని విమర్శించారు. జగన్‌రెడ్డిపై ఉన్న అవినీతి కేసులే ఆయన మౌనానికి కారణమని ధ్వజమెత్తారు. జగన్‌ మాదిరిగానే చంద్రబాబు కూడా కేసుల వల్ల నోరెత్తట్లేదని ఆరోపించారు. విభజన సమయంలో రాష్ట్రానికి కేంద్రం ఎన్నో హామీలిచ్చిందని, ఇచ్చిన హామీలేమీ నెరవేరలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం, కడప స్టీల్‌ ఇలా ఎన్నో హామీలు నెరవేరలేదని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ఉండి ఉంటే హామీలన్నీ నెరవేరేవని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోలవరం, కడప స్టీల్‌ప్లాంట్‌ ఇస్తామన్న రాహుల్‌, రెండు లక్షల రుణమాఫీ, కేజీ టు పీజీ విద్య, రెండున్నర లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదలకు రూ.5 లక్షలతో ఇళ్లు కట్టిస్తామని, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే విప్లవాత్మక మార్పులు తెస్తామన్నారు. పేదల జాబితా రూపొందించి సాయం చేస్తామన్నారు. పేద మహిళల ఖాతాల్లోకి నెలకి రూ.8,500 ఏడాదికి రూ.లక్ష జమచేస్తామని అన్నారు. షర్మిల తన చెల్లెలు అని, ఆమెను గెలిపించి లోక్‌సభకు పంపించాలని కోరారు.

Read Also : Kadapa : షర్మిలను గెలిపించండి – విజయమ్మ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kadapa
  • Lok Sabha Elections
  • rahul gandhi
  • ys sharmila

Related News

Rahul Gandhi

రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్‌..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!

Rahul Gandhi లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్ సభలో బీజేపీ ఓ నోటీసును ఫైల్ చేసినట్లు సమాచారం. అయితే, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే. రాహుల్ తన ప్రసంగంలో కేంద్ర ప్ర

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd