AP : చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం కుట్ర కామెంట్స్ ఫై పురందేశ్వరి రియాక్షన్
బాబు అరెస్ట్ వెనుక బీజేపీ పాత్ర ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని , కొంతమంది కావాలనే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు
- By Sudheer Published Date - 03:29 PM, Sun - 17 September 23

స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill development case)లో చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) చేయడం వెనుక వైసీపీ సర్కార్ (YCP Govt) తో పాటు కేంద్ర ప్రభుత్వ (BJP )కుట్ర కూడా ఉందనే వార్తలపై ఏపీ బిజెపి చీఫ్ పురందేశ్వరి స్పందించారు. వారం క్రితం చంద్రబాబు ను CID అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు పాత్ర ఉందని ఆయన్ను అరెస్ట్ చేయడం..జైలు కు తరలించడం జరిగింది. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర , 14 ఏళ్ల సీఎం గా , పవర్ ఫుల్ ప్రతిపక్ష నేత అలాంటి చంద్రబాబు ను అరెస్ట్ చేసారంటే..దీనిలో ప్రభుత్వ కుట్ర తో పాటు కేంద్ర ప్రభుత్వ కుట్ర కూడా దాగి ఉందనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి.
ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందనే వార్తలను ఏపీ బిజెపి చీఫ్ పురందేశ్వరి (AP BJP President Purandeswari) ఖండించారు. బాబు అరెస్ట్ వెనుక బీజేపీ పాత్ర ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని , కొంతమంది కావాలనే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అదంతా ఫేక్ ప్రచారమని, కేంద్ర ప్రభుత్వం దీని వెనుక లేదని, చంద్రబాబు అరెస్ట్‌పై మొదట స్పందించింది బీజేపీనేనని, ఆయనను అరెస్ట్ చేసిన విధానాన్ని తాము తీవ్రంగా ఖండించినట్లు స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలందరూ బాబు అరెస్ట్‌ను ఖండించారని పేర్కొన్నారు.
Read Also :Chandrababu Will Win : ఏపీలో గెలవబోయేది చంద్రబాబే.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ కనుసన్నల్లో సీఐడీ పనిచేస్తుందని పురందేశ్వరి ఆరోపించారు. సీఐడీ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన ప్రకటనపై కూడా పురందేశ్వరి స్పందించారు. పవన్ వ్యాఖ్యలను తాము తప్పుగా చూడటం లేదన్నారు. బీజేపీ అధిష్టానానికి అన్నీ వివరిస్తామని పవన్ అన్నారని, అదే విధంగా ఏపీ పరిస్థితులను కూడా చెబుతారని పురందేశ్వరి తెలిపారు. బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతూనే ఉందని తెలిపారు. పొత్తుల విషయంపై బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత తమ అభిప్రాయలు చెబుతామన్నారు.