Supreme Court : జస్ట్ అస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్
Supreme Court : 'కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ.. కదా? ఇక చాలు.. ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి.. జరిగిందేదో జరిగిపోయింది. జస్ట్ ఆస్కింగ్'
- By Sudheer Published Date - 03:19 PM, Tue - 1 October 24

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం (Tirumala Laddu Issue) ఫై సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసారు. గత రెండు వారాలుగా తిరుమల లడ్డు వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ దీనిపై వరుస ట్వీట్స్ చేస్తూ హిందువుల్లో , ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో , జనసేన శ్రేణుల్లో ఆగ్రహానికి గురి చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు లడ్డు వ్యవహారం లో సుప్రీం కోర్ట్ ..ప్రభుత్వానిదే తప్పు అన్నట్లు..సీఎం చంద్రబాబు ఆలా ప్రకటన చేయాల్సి ఉండాల్సింది కాదు అన్నట్లు వ్యాఖ్యలు చేయడం తో వైసీపీ సంబరాలు చేసుకుంటూ చంద్రబాబు ఫై కామెంట్స్ చేస్తున్నారు.
ఇదే తరుణంలో ప్రకాష్ రాజ్ (Prakash Raj ) సంచలన ట్వీట్ చేసారు. మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ‘కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ.. కదా? ఇక చాలు.. ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి.. జరిగిందేదో జరిగిపోయింది. జస్ట్ ఆస్కింగ్’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ , కానీ అభిమానులు కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఇటు సీట్ దర్యాప్తు కు సైతం ఏపీ సర్కార్ బ్రేక్ వేసింది. సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి విచారణను కొనసాగిస్తామని వెల్లడించారు. కాగా, ఇప్పటికే దాదాపు 4 రోజులుగా లడ్డూ అంశంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.
కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి … Enough is Enough .. Now will you please focus on what is important to the Citizens.. #justasking
— Prakash Raj (@prakashraaj) October 1, 2024
Read Also : Japan : జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడ రాజీనామా