HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Police Special Treatment To Borugadda Anil

Police Special Treatment to Borugadda Anil : బోరుగడ్డ అనిల్‌ కు సంబంధించి మరో వీడియో హల్చల్..

Police Special Treatment : 'ఏంట్రా అల్లుడు ఏం చేస్తున్నావంటూ' పలకరించి, తన పక్కనే కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడు. కొద్ది సేపు ఆ బాలుడి చెవిలో ఏదో చెప్పినట్లు వీడియోలో కనిపించింది

  • Author : Sudheer Date : 13-11-2024 - 12:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anil Onther Video
Anil Onther Video

వైసీపీ నేత, రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్‌ కుమార్ (Borugadda Anil) కు పోలీసులు సకల మర్యాదలు (Police Special Treatment) చేస్తున్నారని ఇప్పటికే పలు వీడియోలు బయటకు రాగా..తాజాగా మరో వీడియో బయటకు వచ్చి హలచల్ చేస్తుంది. ఈ వీడియో లో తన చెల్లెలి కుమారుడితో పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది సమక్షంలోనే ముచ్చటించినట్లు కనిపిస్తుంది. అక్టోబర్‌ 26 నుంచి 29 వరకు అనిల్‌కుమార్‌ గుంటూరులోని అరండల్‌పేట స్టేషన్‌లో కస్టడీలో ఉండగా, అతని మేనల్లుడు లోపలికి ప్రవేశించగానే అనిల్‌ చిరునవ్వు చిందిస్తూ ‘ఏంట్రా అల్లుడు ఏం చేస్తున్నావంటూ’ పలకరించి, తన పక్కనే కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడు. కొద్ది సేపు ఆ బాలుడి చెవిలో ఏదో చెప్పినట్లు వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కస్టడీలో ఉన్న నిందితుడిని బయటి వ్యక్తి వచ్చి కలవడం పోలీసుల నిర్లక్ష్యమా, లేక అతనికి దాసోహమా అన్నప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.

గుంటూరులోని ఏఈఎల్‌సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబూప్రకాశ్‌ను 50 లక్షల రూపాయలు డిమాండ్‌ చేసి బెదిరించిన కేసులో అరండల్‌పేట పోలీసులు బోరుగడ్డ అనిల్‌ కుమార్​ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి తరలించి, అక్టోబర్‌ 26 నుంచి 29 వరకు అరండల్‌పేట స్టేషన్‌లో విచారించారు. ఆ సమయంలో అనిల్‌కు పోలీసులు రాచమర్యాదలు చేసినట్లు ఇటీవల సీసీ ఫుటేజీ బయటకు వచ్చాయి. స్టేషన్లోనే ప్రత్యేకంగా దిండుతో పడక ఏర్పాటు చేయడం, పోలీసులకే నిందితుడు ఆర్డర్లు వేయడం అతను చెప్పిన దానికల్లా తలూపడంపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. అంతకు ముందు కూడా ఓ రెస్టారెంట్ లో అనిల్ కు విందు భోజనం పెట్టడం పట్ల కూడా పోలీసులపై విమర్శలు వచ్చాయి. మరి అనిల్ కు ఎందుకు ఇంత మర్యాదలు చేస్తున్నారు..అనేది తెలియాల్సి ఉంది.

Read Also : Toyota Vellfire: టయోటా వెల్‌ఫైర్ కొన్న స్టార్ హీరో.. దీని ప్రత్యేకత ఏమిటంటే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Borugadda anil
  • Police Special Treatment
  • police station

Related News

Complaint filed against actor Prakash Raj at the police station.

Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా, కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విష్ణువర్ధన

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd