Nara Lokesh : వైసీపీ నాయకుల ఫిర్యాదుతో.. నారా లోకేష్ పై కేసు నమోదు..
నిన్న జరిగిన పాదయాత్రలో సీఎం జగన్ ఫ్లెక్సీని దగ్గరుండి నారా లోకేశ్ చింపించారని ఘటనా స్థలంలో ఆందోళన చేసి వైసీపీ కార్యకర్తలు, నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Author : News Desk
Date : 02-09-2023 - 6:56 IST
Published By : Hashtagu Telugu Desk
నారా లోకేష్(Nara Lokesh) ప్రస్తుతం యువగళం పాదయాత్ర(YuvaGalam Padayatra) చేస్తున్న సంగతి తెలిసిందే. యువగళం పాదయాత్ర తూర్పుగోదావరి(East Godavari) జిల్లాలో సాగుతుంది. అయితే తాజాగా వైసీపీ(YCP) నాయకుల ఫిర్యాదుతో పోలీసులు(Police) తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పోలీస్ స్టేషన్లో నారా లోకేష్ పై కేసు నమోదు చేశారు. లోకేష్ తో పాటు యువగళం టీమ్ పైన కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు.
నిన్న జరిగిన పాదయాత్రలో సీఎం జగన్ ఫ్లెక్సీని దగ్గరుండి నారా లోకేశ్ చింపించారని ఘటనా స్థలంలో ఆందోళన చేసి వైసీపీ కార్యకర్తలు, నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యకర్తలను లోకేష్ రెచ్చగొట్టి, ఉసిగొల్పుతున్నారని వైసీపీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు నిన్న రాత్రి నల్లజర్ల సెంటర్ లో వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు చేయి చేసుకున్నారని, దాడికి యత్నించారని వైసీపీ నాయకుల ఫిర్యాదుతో టీడీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.
అయితే ఇవన్నీ అబద్దపు కేసులని, వైసీపీ వాళ్ళు కావాలని గొడవ చేస్తున్నారని, పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని టీడీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు.
Also Read : Jamili Elections : కేసీఆర్ కు బీజేపీ జలక్ ఇచ్చినట్టేనా?