Pithani Balakrishna : జనసేన కు భారీ షాక్..వైసీపీ లోకి పితాని బాలకృష్ణ
కూటమి పొత్తు లో భాగంగా జనసేన చాల స్థానాలు కోల్పోవడం..ఆ స్థానాలను నమ్ముకున్న వారికీ నిరాశ మిగలడంతో ఆయా నేతలంతా పార్టీ ని వీడుతున్నారు
- Author : Sudheer
Date : 29-03-2024 - 5:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు (Janasena) భారీ షాక్ తగిలింది. పార్టీలో కీలకనేతగా ఉన్న పితాని బాలకృష్ణ (Pithani Balakrishna) జనసేన (Janasena) క్రీయాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు. రేపు వైసీపీ లో చేరబోతున్నారు. కూటమి పొత్తు లో భాగంగా జనసేన చాల స్థానాలు కోల్పోవడం..ఆ స్థానాలను నమ్ముకున్న వారికీ నిరాశ మిగలడంతో ఆయా నేతలంతా పార్టీ ని వీడుతున్నారు. ఇప్పటికే చాలామంది వైసీపీ (YCP) లో చేరగా..ఇక ఇప్పుడు పితాని బాలకృష్ణ సైతం పార్టీకి రాజీనామా చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
పితాని గతంలో వైసీపీలోనే ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆయన ముమ్మిడివరం వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్నారు. అయితే 2019లో పితానికి వైసీపీ టికెట్ నిరాకరించడంతో అప్పట్లో ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. కానీ, ఆ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన పితాని ఓడిపోయారు. ఇప్పుడు జనసేన టికెట్ నిరాకరించడంతో మళ్లీ వైసీపీలో చేరబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కనీసం తనను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని పితాని బాలకృష్ణ ఆరోపించారు. పొత్తులో భాగంగా 21 సీట్లు వస్తే ఒక్క శెట్టి బలిజకు కూడా సీటు ఇవ్వలేదని ఆరోపించారు.
Read Also : CBN-Prajagalam : జే టాక్స్, జే బ్రాండ్ పేరిట ప్రజల జేబులు కొల్లగొట్టిన ఘనత జగన్ ది – చంద్రబాబు