Kutami Govt : కూటమి ప్రభుత్వం పై విరుచుకుపడ్డ పేర్ని నాని
Kutami Govt : పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు... ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా? అని సెటైరికల్ కామెంట్స్ చేశారు
- Author : Sudheer
Date : 05-07-2025 - 7:17 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు పెరిగిపోతున్నా, ప్రభుత్వం, పోలీసులు స్పందించకపోవడం దారుణమని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. “రాష్ట్రంలో న్యాయం చెప్పాల్సిన పోలీస్ వ్యవస్థ మౌనమైపోయింది. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జగన్ అనుచరులను అణిచివేయడానికి చంద్రబాబు, టీడీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారు. న్యాయం చేయాల్సిన పోలీసు శాఖ టీడీపీ నేతల పక్షంగా వ్యవహరిస్తోంది అని ఆరోపించారు.
Hyderabad : నాచారంలో అమాయక యువతిపై దారుణం
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు మన్నవ గ్రామ సర్పంచ్ నాగ మల్లేశ్వరరావుపై హత్యాయత్నం చేసిన ఘటనను ఉదహరించిన నాని, “ఇరవై ఏళ్లుగా ప్రజలు మన్నవ కుటుంబాన్ని ఎన్నుకుంటూ వస్తున్నారు. అలాంటి వ్యక్తిపై దాడి చేయడం రాజకీయ వేధింపులే తప్ప మరేం కాదంటూ, దాడి చేసినవారు గతంలో బాబూరావు అనే టీడీపీ నేతతో గొడవ పడినవారని గుర్తు చేశారు. అదే సమయంలో అలాంటి దుర్మార్గాలకు పోలీస్ శాఖ మౌనం పాటించడం దురదృష్టకరమని మండిపడ్డారు.
Lokesh : చదువుకోవాలన్న తపన..చిన్నారుల మనోభావాలకు స్పందించిన మంత్రి లోకేశ్
పవన్ కళ్యాణ్‌పై కూడా పేర్నినాని ఘాటుగా స్పందించారు. “ప్రజల సమస్యలపై స్పందించకుండా సినిమా డైలాగులు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. ఎప్పుడు చంద్రబాబు ఇబ్బందుల్లో ఉన్నా, ఆయనకు అండగా వస్తారు కానీ సామాన్యుల బాధలపట్ల ఏమాత్రం స్పందన లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్లోనే వ్యవహరిస్తున్నారు. ఆయన పార్టీ ప్రజలకోసం కాదు, టీడీపీకి అద్దెకు తీసుకున్నటువంటిదే. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, దౌర్జన్యాలపై ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో తిరగడమే మిగిలింది” అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.