Tirupathi : కోడిబొచ్చు అమ్ముకునేవాళ్లంటూ తిరుపతి సభలో రెచ్చిపోయిన పవన్
కోడిబొచ్చు అమ్ముకునే కరుణాకర్ రెడ్డి (భూమన) వాళ్లబ్బాయి మీకు ఎమ్మెల్యేగా కావాలా? లేదంటే... మోదీ, చంద్రబాబు, జనసేన మద్దతుతో బలంగా నిలబడిన ఆరణి శ్రీనివాసులు కావాలా..? అని ప్రశ్నించారు
- By Sudheer Published Date - 10:48 PM, Tue - 7 May 24

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawam Kalyan) ..చంద్రబాబు (Chandrababu) తో కలిసి తిరుపతి (Tirupathi) లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. కాలిగాయం నిప్పితోనే పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కోడిబొచ్చు అమ్ముకునేవాళ్లంటూ కరుణాకర్ రెడ్డి ఫై నిప్పులు చెరిగారు. ముందుగా చంద్రబాబుఫై ప్రశంసలు కురిపించిన పవన్..ఆ తర్వాత వైసీపీ నేతలపై విరుచుకపడ్డారు. కోడిబొచ్చు అమ్ముకునే కరుణాకర్ రెడ్డి (భూమన) వాళ్లబ్బాయి మీకు ఎమ్మెల్యేగా కావాలా? లేదంటే… మోదీ, చంద్రబాబు, జనసేన మద్దతుతో బలంగా నిలబడిన ఆరణి శ్రీనివాసులు కావాలా..? అని ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join.
తిరుపతి పవిత్రతను కాపాడుకుంటా, తిరుపతి ఆధ్యాత్మికతను రక్షించుకుంటాం, కులాలకు, మతాలకు భేదాలు చూడకుండా అందరినీ సంరక్షించుకుంటాం అని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాం ఇక్కడి నుంచి అమరరాజాను తరిమేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ అమరరాజాను తీసుకువస్తాం. ప్రజలు గనుక కరుణాకర్ రెడ్డికి గానీ, వాళ్లబ్బాయికి గానీ ఓటేస్తే… ప్రతి దాంట్లో 10:30 నిష్పత్తిలో పంపకాలు చేసుకుంటారు. ఇల్లు కట్టాలంటే 10 శాతం కొడుక్కి, 30 శాతం తండ్రికి చెల్లించాల్సిందే అన్నారు. కరుణాకర్ రెడ్డి, వాళ్లబ్బాయి, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి… శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లన్నింటిని నరికేశారు. రూ.2 వేల కోట్ల టీడీఆర్ బాండ్ల స్కాం జరిగింది… డబ్బంతా ఎక్కడికి పోతోంది? ఈ పరిస్థితి మార్చుకోవాలంటే కూటమి ప్రభుత్వం రావాలన్నారు.
Read Also : YS Sharmila : వివేకా హత్యలో 40 కోట్ల రూపాయలు చేతులు మారాయి – వైస్ షర్మిల