HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Warned Of Consequences Of Anti Ysrcp Votes Are Split

Pawan Kalyan on AP: ‘వైసీపీ’ వ్యతిరేక ఓటు చీలితే…ఏపీ అంధకారంలోకి వెళ్లిపోతుంది – ‘పవన్ కళ్యాణ్’..!

అస్తవ్యస్తంగా ఉన్న వైసీపీ పాలన నుంచి విముక్తి కోసం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ పాలన రావాలని దాన్ని జనసేన పార్టీ బలంగా ముందుకు తీసుకువెళ్లాలన్నదే తన కోరిక అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

  • By Hashtag U Published Date - 08:01 PM, Sun - 8 May 22
  • daily-hunt
pawan kalyan
pawan kalyan

అస్తవ్యస్తంగా ఉన్న వైసీపీ పాలన నుంచి విముక్తి కోసం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ పాలన రావాలని దాన్ని జనసేన పార్టీ బలంగా ముందుకు తీసుకువెళ్లాలన్నదే తన కోరిక అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ని రక్షించాలంటే ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదన్నారు, చీలితే రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందన్న ఉద్దేశ్యంతోనే ఆవిర్భావ సభలో ఆ మాట అన్నట్టు తెలిపారు.

వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోతే.. వైసీపీ మళ్లీ వస్తే ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిపోతుందన్నారు. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడాలి తప్ప తన వ్యక్తిగత ఎదుగుదల కోసం ఏ రోజూ చూడలేదన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర మధ్యలో శిరివెళ్ళ సమీపంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “2014లో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి పోటీ చేశాం.. నా దృష్టిలో పొత్తు ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజల సమస్యలు పరిష్కరించలేనప్పుడు నేను ఆ పొత్తులో నుంచి బయటకు వస్తాను తప్ప వ్యక్తిగత లాభాపేక్ష కోసం మాత్రం పొత్తు పెట్టుకోను. మార్చి 14న ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అనడానికి వైసీపీ పాలనే కారణం. ఈ ప్రభుత్వం ఎవ్వరినీ బతకనీయడం లేదు. అందరి ఆర్ధిక మూలాలు దెబ్బకొడుతున్నారు. కౌలు రైతులు చచ్చిపోతుంటే వారికి అండగా నిలబడడం లేదు. యువతకు ఉద్యోగాలు లేవు.

జాబ్ క్యాలెండర్ లేదు. పరిశ్రమలు రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. కరెంటు కోతలు. ఈ సమస్యలన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు చాలా బలమైన ప్రత్యామ్నాయం కావాలి అందుకు చాలా మంది కలసి రావాలని భావించాను. వ్యతిరేక ఓటు చీలిపోతే పాలన మరింత దిగజారిపోతుంది. రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితులు చూస్తే.. శాంతి భద్రతలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలుస్తుంది. ఆడబిడ్డల గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే పరిస్థితులు వచ్చినా మాట్లాడే పరిస్థితి లేదు. మీరు లా అండ్ ఆర్డర్ కాపాడండి అంటే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో చాలా చిన్న విషయంగా మాట్లాడుతారు. పైగా బిడ్డలు చేసిన తప్పులకు తల్లే బాధ్యత వహించాలని మాట్లాడే విపరీతకరమైన ధోరణులు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన ప్రత్యామ్నాయం కావాలి. ప్రత్యామ్నాయంగా ఒక బలమైన శక్తి ఉండాలి. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అన్ని పార్టీలు కలసి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఎదురొడ్డి నిలిచాయి. అస్థవ్యస్థంగా ఉన్న వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలంటే ఓటు చీలకూడదు.

ఎంత వరకు అందరూ కలసి వచ్చి విశాల దృక్పథంతో అర్ధం చేసుకుని ప్రజలకు ఎంత భరోసా కల్పిస్తారనేది భవిష్యత్తులో తేలుతుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. దీని మీద ఒక చర్చ జరగాలి. ప్రస్తుతం బీజేపీతోనే పొత్తులో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, ఇక్కడ పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం. ఖచ్చితంగా వారు అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాం.
కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా ఈ రోజు 130 మంది కౌలు రైతులకు రూ. లక్ష చొప్పున సాయం చేయబోతున్నాం. మార్గం మధ్యలో నలుగురికి సహాయం అందించాం. జనసేన ప్రారంభం నుంచి ప్రజలకు అండగా నిలవాలనే దృక్పథం తప్ప ఏనాడూ అధికారం కోసం అర్రులు చాచలేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాలి. ప్రజల విశ్వాసం చూరగొనాలి. తద్వారా అధికారం వచ్చే దిశగా అడుగులు వేయాలి. అందుకు అనుగుణంగానే ముందుకు సాగుతున్నాం. మేము వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. 151 మంది ఎమ్మెల్యేలు, 28 మంది పార్లమెంటు సభ్యులు ఉండి ఎన్నో సమస్యల్ని హుందాగా పరిష్కరించి ఉండొచ్చు.

అలా పరిష్కరించలేని పక్షంలో ఎందుకు చేయలేకపోయాం అనేది సంజాయిషీ చెప్పాలి. కానీ రాష్ట్రంలో మాకు సంఖ్యాబలం ఉంది. మేము ఏమైనా మాట్లాడగలం. ఏమైనా చేయగలం అన్న పద్దతిలో ప్రవర్తిస్తున్నారు. మేము నిజంగా ప్రజల పక్షాన ఉండడానికి వచ్చాం. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి తటస్తులు సైతం రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులు చూసి గగ్గోలు పెడుతున్న దుస్థితి.
వైసీపీ సవ్యమైన పాలన చేయకపోవడం వల్లే జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర చేయాల్సిన అవసరం వచ్చింది. మేనిఫెస్టోలో కౌలు రైతు చనిపోతే రూ.7 లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకే ఇబ్బంది కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు పార్టీపరంగా రూ. 5 లక్షలు ఇస్తున్నప్పుడు.. ప్రజల దగ్గర శిస్తులు, పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఎంత చేయాలి. రాష్ట్రంలో 90 శాతం భూమిని పండించేది కౌలు రైతులే. అలాంటి కౌలు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. పంట అమ్మినా డబ్బు రాక అప్పులు పేరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

కౌలు రైతులను వేధిస్తున్నారు:
మా జేబులో డబ్బు ఇద్దామని ముందుకు వస్తే లబ్దిదారులైన కౌలు రైతుల్ని వేధిస్తున్నారు. గ్రామ స్థాయి, జిల్లా స్థాయి వైసీపీ నాయకులు దేనికి భయపడుతున్నారు. మీరు సమస్య తీర్చరు. అమ్మ పెట్టదు అడుక్కుతిననివ్వదు అన్నట్టు తయారయ్యారు. మా కష్టార్జితంలో కొంత 3 వేల మంది రైతులుకు అండగా ఉందామని భావిస్తే వారిని బెదిరిస్తున్నారు. ఈ రోజు కూడా దారిలో కూడా ఇద్దరు రైతుల్ని ఆపేశారు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి చర్యల వల్ల, దీనివల్ల ప్రజల్లో ఆగ్రహం ఎక్కువ అవుతుంది. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే కరెంటు కోతలు, ఉద్యోగుల సమస్యలు, జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు, పరిశ్రమలు లేవు. ఎవరైనా మాట్లాడితే మూకుమ్మడిగా మీద పడి దౌర్జన్యం చేస్తారు. ఒక క్రమపద్దతిలో మాట్లాడే పరిస్థితులు లేవు. నోరేసుకుపడిపోయే వైసీపీ నాయకులకు ఒక్కటే చెబుతున్నాం. మీరు ఏం చేసినా మేము వెనక్కి తగ్గం” అన్నారు పవన్ కళ్యాణ్.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh elections
  • Jana Sena
  • Pawan Kalyan
  • YSRCP anti votes

Related News

Lokesh Pawan

Pawan Kalyan Next Film : పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

Pawan Kalyan Next Film : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ సెటప్‌ కానుందనే వార్త సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్

    Latest News

    • Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

    • Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

    • Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • VH Fell Down In Bc Rally : బీసీ బంద్ పాల్గొంటూ కిందపడ్డ వీహెచ్

    • MLC Kavitha Son Aditya : బరిలోకి కొడుకును దింపిన కవిత

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd