HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Takes Lokeshs Comments To Task

AP Assembly : లోకేష్ వ్యాఖ్యలను తప్పు పట్టిన పవన్ కళ్యాణ్

ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ప్రసంగంలో దొర్లిన కొన్ని వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ సున్నితంగానే అయినా చాలా బలంగా తప్పు పట్టారు. మనలో మనకు ప్రాంతీయ విభేదాలు ఉంటే రాష్ట్రాన్ని రక్షించుకోవడం సాధ్యం కాదని ఆయన హెచ్చరించడం చర్చనీయాంశమైంది

  • Author : Sudheer Date : 28-03-2026 - 7:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Speech Assembly
Pawan Speech Assembly

ఏపీ అసెంబ్లీలో అమరావతి రాజధాని చట్టబద్ధత తీర్మానం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రాత్మక తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సుమారు ఐదున్నర గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం, ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. అయితే, ఈ చర్చా సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ప్రసంగంలో దొర్లిన కొన్ని వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ సున్నితంగానే అయినా చాలా బలంగా తప్పు పట్టారు. మనలో మనకు ప్రాంతీయ విభేదాలు ఉంటే రాష్ట్రాన్ని రక్షించుకోవడం సాధ్యం కాదని ఆయన హెచ్చరించడం చర్చనీయాంశమైంది.

సబ్ డివిజన్ల ధోరణి వీడాలి -లోకేష్ వ్యాఖ్యలపై అభ్యంతరం

అసెంబ్లీలో నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘మీ ఉత్తరాంధ్రకు అవసరం లేదా?’ అని ప్రశ్నించిన తీరుపై పవన్ కళ్యాణ్ స్పందించారు. “మనం ఇంకా ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాలు అని విడిపోకూడదు.. అందరం మాట్లాడేది తెలుగే, అందరిదీ ఒకటే నేల” అని పవన్ గుర్తు చేశారు. 1953 నుంచి నేటి వరకు ఆంధ్రులు తమ ఉనికి కోసం, ఆస్తుల కోసం పోరాడుతూనే ఉన్నారని, ఇంకా మనం అంతర్గత విభజనల గురించి మాట్లాడుకుంటే మన బలహీనతే ఇతరుల గెలుపు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు, మేధావులు అంతా ‘ఒకే రాష్ట్రం-ఒకే జాతి’ అనే భావనతో ఉండాలని, అప్పుడే కేంద్రం వద్ద మన గొంతు బలంగా వినిపిస్తుందని పవన్ కళ్యాణ్ హితబోధ చేశారు.

రాజకీయ స్థిరత్వమే ప్రగతికి సోపానం – కాంగ్రెస్ తీరుపై విమర్శలు

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. విభజన జరిగిన ఇన్నేళ్ల తర్వాత కూడా సరైన హైకోర్టు, రాజధాని లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు టెంట్‌ వేసుకొనైనా పని చేద్దామని భావించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం అత్యవసరమని పేర్కొన్నారు. అమరావతి విషయంలో జనసేన పార్టీ మొదటి నుంచి ఒకే మాట మీద ఉందని, రాజధాని నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం ప్రాంతీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ముఖ్యమని ఆయన తన ప్రసంగంలో నొక్కి చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amravati Legal Validity Resolution
  • ap assembly
  • nara lokesh
  • North Andhra & Rayalaseema
  • Pawan Kalyan
  • Regional Divisions
  • Sub-divisions mindset

Related News

Amaravati Bill Set

Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

Amaravati  అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైతే, వైసీపీ సభ్యులు హాజరుకాకపోవడాన్ని మంత్రి నారా లోకేశ్ తప్పుబట్టారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీకి రాజధానిపై ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ వైఖరితోనే అర్థమవుతోందని విమర్శించారు. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏమిటో, ఆయన జ్ఞానం ఎంతో అందరికీ తెలుస

  • Bari Opening

    Pawan Kalyan : నిహారిక – వరుణ్ తేజ్ లకు పవన్ సపోర్ట్ ..ఓపెనింగ్ తోనే హైప్ తెచ్చుకున్న ‘బరి’

  • Amaravati Capital

    AP Assembly: అమరావతికి చట్టబద్ధత

  • Pawan Kalyan Election Campa

    Pawan Kalyan Election Campaign : తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

  • Speaker Ayyanna Patrudu

    AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం : అయ్యన్నపాత్రుడు

Latest News

  • CM Revanth Reddy: అక్రమ మైనింగ్‌పై సీఎం రేవంత్ ఉక్కుపాదం

  • IPL 2026 : RCB కి 202 టార్గెట్ పెట్టిన SRH

  • Hyderabad : సైబరాబాద్ అనేది చంద్రబాబు విజన్ కు ప్రతిరూపం – పవన్

  • AP Capital : జగన్ ను ఊసరవెల్లితో పోల్చిన చంద్రబాబు

  • Peddi : ‘పెద్ది’ రీమేక్ మూవీనా..?

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd