Pawan Kalyan : ద్వారంపూడికి దడ పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలను ప్రజల ముందు పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాడా..? ద్వారంపూడి చంద్రశేఖర్ ను నడి రోడ్ మీదకు లాగుతా అంటూ గతంలో సవాల్ చేసిన పవన్
- By Sudheer Published Date - 06:53 PM, Sat - 6 July 24

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ..కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (Dwarampudi Chandrasekhar Reddy) ఫై ఫుల్ ఫోకస్ పెట్టాడా..? గడిచిన ఐదేళ్లలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచుకున్న సొమ్మును కక్కించేందుకు పవన్ భారీ స్కెచ్ వేశాడా..? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలను ప్రజల ముందు పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాడా..? ద్వారంపూడి చంద్రశేఖర్ ను నడి రోడ్ మీదకు లాగుతా అంటూ గతంలో సవాల్ చేసిన పవన్..ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారా..? అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి.
తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..వైసీపీ (YCP) నేతలెవర్నీ వదిలిపెట్టడం లేదు..ఐదేళ్లు టీడీపీ , జనసేన నేతలకు , శ్రేణులకు ఎంత నరకం చూపించారో..అంత రెట్టింపు చూపించడం మొదలుపెట్టారు. గల్లీ నేతలనే కాదు మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను సైతం వదిలిపెట్టడం లేదు. వారు దోచుకున్న సొమ్ము , అక్రమంగా కట్టుకున్న కట్టడాలను ఇలా అన్నింటిని బయటకు తీస్తూ గజగలాడిస్తున్నారు. ఇప్పటికే మాజీ సీఎం తాడేపల్లి ఇనుప కంచెలు బద్దలు కొట్టిన కూటమి సర్కార్..మిగతా నేతల అక్రమ కట్టడాలను ఎక్కడిక్కడే కూల్చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
నాల్గు రోజుల క్రితం కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (Dwarampudi Chandrasekhar Reddy)కి చెందిన అక్రమ కట్టడాలను కూల్చేశారు. అంతే కాదు ఐదేళ్లలో ద్వారంపూడి చేసిన నేరాలు , ఘోరాలు , అక్రమంగా తరలించిన రేషన్ ఇలా అన్నింటిని బయట పెట్టి జైల్లో వేసేందుకు పవన్ పక్క ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ద్వారంపూడి కుటుంబం రేషన్ దందా చేస్తుందని ఆరోపిస్తున్న జనసేన మంత్రులు ద్వారంపూడి కుటుంబం లక్షల టన్నుల రేషన్ బియ్యం ఎగుమతుల పైన లోతుగా ఆరా తీస్తున్నారు. అలాగే ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని గుర్తించిన పవన్.. ఫ్యాక్టరీల పైన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్ సంస్థ శుద్ధి చేయని వ్యర్ధాలను పంట కాలవల్లోకి విడుదల చేయడం పైన విచారణకు ఆదేశించారు. పర్యావరణ ఉల్లంఘనల పైన సమగ్ర విచారణ జరిపి 15 రోజుల్లోగా ఆ సంస్థకు నోటీసులు ఇవ్వాలని సూచించారు.
ఇలా వరుసగా పవన్ టార్గెట్ చేయడం తో చంద్రశేఖర్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు..ఎప్పుడు ఏంజరుగుతుందో అని భయపడుతున్నాడు. కేవలం ఆయనే మాత్రమే కాదు గడిచిన ఐదేళ్లలో ఎవరైతే తన ఫై నోరు పారేసుకున్నారో ఆ నేతలందరికీ వరుస షాకులు ఇచ్చేందుకు పవన్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. మరి చంద్రశేఖర్ తర్వాత పవన్ ఏ నేత ఫై ఫోకస్ చేస్తాడో చూడాలి.
Read Also : BRS MLAs : మంత్రి శ్రీధర్ బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం..