HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Speech In Varahi Sabha

Varahi Sabha : రేపటి వారాహి సభపై ఉత్కంఠ..!!

Varahi Sabha : మరి వారాహి డిక్లరేషన్‌లో పవన్ కళ్యాణ్ ఏం రాశారు ? పవన్ కల్యాణ్ సభలో ఏం చెప్పనున్నారు ? సనాతన ధర్మ పరిరక్షణ కోసమే పవన్ కళ్యాణ్ కదిలాడా ? గత ప్రభుత్వ తప్పులను పరిష్కరించడమే ఆయన ఎజెండానా ? అసలు కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటి ?

  • Author : Sudheer Date : 02-10-2024 - 11:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Varahisabha
Varahisabha

ఏపీ రాజకీయాలు (AP Politics) మళ్లీ వేడెక్కుతున్నాయి. గత రెండు వారాలుగా తిరుమల లడ్డు (Tirumala Laddu Issue) ఇష్యూ పై పెద్ద వివాదం కొనసాగగా..సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేయడం తో ఇక సైలెంట్ అయినట్లే అని అంత అనుకుంటున్నారు..ఇదే సందర్బంగా రేపు వారాహి సభ (Varahi Sabha) లో పవన్ కళ్యాణ్ ఏమాట్లాడతారో (Pawan Kalyan Speech at Varahi Sabha) అనే ఉత్కంఠ నెలకొంది. తిరుపతిలో గురువారం నిర్వహించే వారాహి సభ వేదికగా సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు ట్విట్టర్ ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయాశ్చిత దీక్షను విరమించిన తర్వాత వారాహి డిక్లరేషన్ గురించి వివరించారు. తిరుపతిలో వారాహి సభను సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు అంకితం చేయనున్నట్లు పవన్ తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరుకునే లక్షలాది మంది స్వరాలను ప్రతిధ్వనించడమే లక్ష్యంగా వారాహి సభను నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

మరి వారాహి డిక్లరేషన్‌లో పవన్ కళ్యాణ్ ఏం రాశారు ? పవన్ కల్యాణ్ సభలో ఏం చెప్పనున్నారు ? సనాతన ధర్మ పరిరక్షణ కోసమే పవన్ కళ్యాణ్ కదిలాడా ? గత ప్రభుత్వ తప్పులను పరిష్కరించడమే ఆయన ఎజెండానా ? అసలు కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటి ? హిందుత్వ ఎజెండాలో జనసేన ఒంటరిగానే ముందుకుపోతోందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు అందరిలో కలుగుతున్నాయి. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. హైందవ మతాన్ని, దేవుళ్లను రాజకీయాలకు వాడుకోకుండా.. దేవాలయాల నిర్వహణ, పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా వినిపిస్తోంది. దీనికోసం పలువురు స్వామీజీలు ప్రభుత్వాలకు విన్నవించినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన ప్రజల సహకారంతో ఈ డిమండ్‌ను తెరపైకి తీసుకువచ్చింది. హైందవ సంఘాలు సైతం పవన్ కళ్యాణ్ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం నాటి వారాహి సభలో పవన్ కళ్యాణ్ ఎలాంటి విషయాలు మాట్లాడబోతున్నారు.. డిక్లరేషన్‌లో ఏమి పొందుపర్చారనేది ఆసక్తికరంగా మారింది.

తిరుమల లడ్డు అపవిత్రమైందని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈరోజు శ్రీవారి సన్నిధానంలో దీక్షను విరమించారు. మంగళవారం రాత్రికి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తన ఇద్దరు కూతుళ్లు కుమారి ఆద్య కొణిదెల, కుమారి పొలెనా అంజలి కొణిదెలలతో కలసి మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు జరుగుతున్న అన్నదాన సరళిని పరిశీలించారు. అనంతరం సామాన్య భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. వారాహి డిక్లరేషన్‌ బుక్‌ను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. వారాహి డిక్లరేషన్‌ బుక్‌ను ఆలయం వెలుపల మీడియాకు చూపించారు. బుధవారం వారాహి సభలో బుక్‌లోని అంశాలను పవన్‌ కల్యాణ్ ప్రజలకు వివరించనున్నారు.

Read Also : Konda Surekha Comments : దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి – చైతు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Deputy CM Pawan kalyan
  • pawan tirupathi
  • Varahi Sabha

Related News

Prakash Raj lashes out over repeated arrests of 'Ravan'.

Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాంశాలపై సోషల్ మీడియాలో విమర్శలు చేసే యూట్యూబర్ ‘ప్రశ్న’ రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్టుల పర్వం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయన్ని వరుసగా అరెస్ట్ చేస్తుండటంపై నటుడు ప్రకాష్ రాజ్ శనివారం మరోసారి అత్యంత ఘాటుగా స్పందించారు. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

  • AP Police arrest YouTuber Ravan.

    YouTuber Prashna Ravan: యూట్యూబర్‌ రావణ్‌ను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు

Latest News

  • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

  • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd