HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Press Meet At Mangalagiri

Pawan Kalyan : ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం మనకు అవసరమా..? – పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగులకు టైంకు జీతాలు ఇవ్వడం లేదు..20 వ తారీకు వచ్చిన వారికీ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు

  • Author : Sudheer Date : 06-10-2023 - 8:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan
pawan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..వైసీపీ పార్టీ ఫై ఏమాత్రం దూకుడు తగ్గించడం లేదు. పబ్లిక్ సభల్లో ఎలాగైతే మాటల తూటాలు పేలుస్తూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాడో..మీడియా సమావేశాల్లో కూడా వైసీపీ చేస్తున్న పనులపై..రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు , అరాచకాలు , దోపిడీలు ఇలా ప్రతి వాటిపై ప్రశ్నిస్తున్నారు.

తాజాగా శుక్రవారం మీడియా సమావేశంలో మరోసారి వైసీపీ (YCP) ఫై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగులకు (AP Government Employees salary) టైంకు జీతాలు ఇవ్వడం లేదు..20 వ తారీకు వచ్చిన వారికీ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్ అధికారులకు నెల నెలా జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని తెలిపాడు. ఇది నిజంగా రాష్ట్రానికి సిగ్గు చేటన్నారు. ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులకు ఇవ్వాల్సిన జీతాలను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఏకరువు పెట్టారు. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అంటూ పవన్ ప్రశ్నించాడు.

We’re now on WhatsApp. Click to Join.

వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే తన లక్ష్యమని .. ఢిల్లీలో బీజేపీ నేతలతో కూడా ఇదే విషయం చెప్పానని జనసేనాని స్పష్టం చేశారు. తాము ఎన్ని చోట్ల పోటీ చేస్తాం.. ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది మీకు అనవసరమని వైసీపీ నేతలకు చురకలంటించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున తన కార్యక్రమాల కోసం వెళ్తుంటే తనను ఆపేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో సమన్వయం కోసం ఐదుగురితో జనసేన పార్టీ కమిటీ వేసిందన్నారు.

అలాగే చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ఫై చిత్రసీమ స్పందించకపోవడం ఫై పవన్ స్పందించారు. చిత్రసీమ మీద పూర్తి ఒత్తిడి ఉంటుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో స్పందించడానికి కూడా సినిమా వాళ్లు భయపడతారని పవన్ చెప్పుకొచ్చారు. గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడే మండలాధీశుడు వంటి చాలా సినిమాలు తీశారు. కోట, పృధ్వీ వంటి వారు ఎన్టీఆర్ క్యారెక్టర్‌లో నటించారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. అందుకే ఏం మాట్లాడాలన్న భయంతో ఉన్నారని తెలిపారు. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి.. మొండి వాడ్ని కాబట్టి.. నేను స్పందించాను అని వ్యాఖ్యానించారు.

Read Also : Nara Lokesh : నారా లోకేష్ టంగ్ స్లిప్ అవ్వడంతో.. థాంక్స్ చెప్పిన మంత్రి రోజా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap government employees salary
  • Chandrababu Arrest
  • Pawan Kalyan
  • ycp

Related News

Amaravati Billu

Amaravati Bill: పార్లమెంట్ లో ‘అమరావతి బిల్లు’ కు గ్రీన్ సిగ్నల్ ..వైసీపీ వాకౌట్

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతంగా ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చారిత్రాత్మకమైన సవరణ బిల్లును ప్రవేశపెట్టింది

  • Pawan Kalyan Ustad Bhagat Singh Working stills released from Movie Unit Shootings not stopped with Chandrababu Arrest

    Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

  • Pawan Prakash Raj

    ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

  • Pawan Speech Assembly

    AP Assembly : లోకేష్ వ్యాఖ్యలను తప్పు పట్టిన పవన్ కళ్యాణ్

  • Bari Opening

    Pawan Kalyan : నిహారిక – వరుణ్ తేజ్ లకు పవన్ సపోర్ట్ ..ఓపెనింగ్ తోనే హైప్ తెచ్చుకున్న ‘బరి’

Latest News

  • రామాయణ మూవీలో ల‌క్ష్మ‌ణుడి పాత్ర చేసింది ఎవ‌రంటే?

  • పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట!

  • ఐపీఎల్‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన ర‌హానే!

  • భార‌త మార్కెట్లోకి కొత్త ఎల‌క్ట్రిక్ కారు.. ధ‌ర ఎంతంటే?

  • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

Trending News

    • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

    • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

    • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

    • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd