HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Power Full Speech In Avanigadda

Pawan Kalyan : వైసీపీ పతనం మొదలైంది – టీడీపీ , జనసేన గెలుపు ఖాయం

అధికార మదం ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం.. మీరు కౌరవులు

  • By Sudheer Published Date - 07:53 PM, Sun - 1 October 23
  • daily-hunt
Pawan Avanigadda
Pawan Avanigadda

వైసీపీ (YCP) పతనం మొదలైంది..రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే..ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ (Jagan) అంటున్నారు. ఆ కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులు.. మీరు కౌరవులని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 4 వ విడత వారాహి యాత్ర (Varahi Yatra) ను పవన్ కళ్యాణ్ ఈరోజు అవనిగడ్డ నుండి ప్రారంభించారు. ఈ సందర్బంగా అవనిగడ్డలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ (Varahi Sabha) లో వైసీపీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వమని చెప్పా

ఈ 10 ఏళ్లలో జనసేన (Janasena) చాలా దెబ్బలు తిన్నది. ఆశయాలు, విలువల కోసం పార్టీ నడుపుతున్నాం. వైసీపీని ఓడించడమే జనసేన టార్గెట్ అని తేల్చి చెప్పారు పవన్. మేము అధికారంలోకి రావడం డబుల్‌ ఖాయం.. మెగా డీఎస్సీ (Mega DSC) వారికి ‌న్యాయం జరగడం ట్రిపుల్‌ ఖాయమన్నారు హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రానికి అవనిగడ్డ (Avanigadda) డీఎస్సీ శిక్షణలో ఆయువుపట్టు. 30 వేల పైచిలుకు డీఎస్సీ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. లక్షకోట్లు, కిరాయి సైన్యం, పోలీస్ శాఖ వారి దగ్గర ఉంది..మా దగ్గర ఏముంది ఒక మైక్ తప్ప. మాజీ ప్రభుత్వ ఉద్యోగి‌ కొడుకుగా చెబుతున్నా.. ప్రభుత్వ ఉద్యోగుల‌ కష్టాలు తీరుస్తాను. పదేళ్లలో చాలా దెబ్బలు తిన్నాను.. ఓటమి నిస్సహాయంగా ఉంటుంది. ఆశయాలు, విలువల‌కోసం నడిపేవాడ్ని కాబట్టే నిలబడి ఉన్నాను’ అని పవన్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వమని చెప్పా. మనకు పార్టీల కంటే ఈ రాష్ట్రం చాలా ముఖ్యం. రాష్ట్ర యువత.. ఎంతో విలువైన దశాబ్ద కాలం కోల్పోయారు.

ఇక కురుక్షేత్ర యుద్ధమే

జగన్‌ రూ.వేల కోట్ల అవినీతి చేసినట్లు రుజువైంది. ఈ దేశ ప్రధానికి జగన్‌ గురించి తెలియదా? సమాఖ్య స్ఫూర్తి కోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని గౌరవించాలి కదా..! అధికార మదం ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం.. మీరు కౌరవులు. సరైన వ్యక్తులను గెలిపించుకోకుంటే ఒక తరం నష్టపోతుంది. జగన్‌ ఓటమి ఖాయం.. టీడీపీ – జనసేన అధికారంలోకి రావడం ఖాయం” అని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.

రాబోయే ఎన్నికల్లో జగన్‌కు 175 కాదు.. 15 సీట్లు వస్తే చాలా గొప్ప

”జగన్‌ ముద్దూమురిపాలతో పదేళ్లు జనంలో తిరిగారు. జగన్‌ను దేవుడని మొక్కితే.. ఆయన దయ్యమై ప్రజలను పీడిస్తున్నారు. కృష్ణా జిల్లాలో 86 ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా ప్రజలకు ఇంటింటికీ తాగునీరు ఇస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తున్న వైసీపీ మహమ్మారికి.. జనసేన-టీడీపీ వ్యాక్సినే మందు. మనల్ని కులాలుగా వేరు చేస్తున్నారు.. కులం కంటే మానవత్వం గొప్పది. నేనెప్పుడూ ఎవరిలో కులం చూడలేదు.. గుణమే చూశా. ప్రతి ఒక్కరిలో గుణం, ప్రతిభ, సామర్థ్యం మాత్రమే చూస్తా. ఏపీ అభివృద్ధిని వైసీపీ ఫ్యాన్‌కు ఉరి వేసేశారు. సైకిల్, గ్లాస్‌ కలిసి ఫ్యాన్‌ను తరిమేయడం ఖాయం. వైసీపీ ఫ్యాన్‌కు కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు. జగన్‌ పరిస్థితి.. ఓడిపోయే ముందు హిట్లర్‌ పరిస్థితిలా ఉంది. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు 175 కాదు.. 15 సీట్లు వస్తే చాలా గొప్ప” అని పవన్‌ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ఈ సభకు జనసేన శ్రేణులతో పాటు టీడీపీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేసారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Avanigadda
  • Janasena
  • Pawan Kalyan
  • TDP Janasena
  • Varahi Yatra 4th phase
  • ycp

Related News

Jagan Lokesh

Jagan – Lokesh : జగన్ కు లోకేష్ కు తేడా ఇదే..దటీజ్ లోకేష్ అన్న !!

Jagan - Lokesh : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో నాయకులు తమ అధినేత జగన్‌ను మెప్పించడానికి ఇష్టం వచ్చినట్లుగా వ్యక్తిగత దూషణలకు, అభ్యంతరకర భాషకు పాల్పడటం గతంలో చూశాం

  • Vijayasai Reddy attends CID inquiry

    VSR : మళ్లీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విజయసాయి

Latest News

  • Rishabh Pant: అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన టీమిండియా క్రికెట‌ర్‌!

  • Ayodhya: ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య.. రియల్ ఎస్టేట్‌లో నూతన శకం!

  • Telangana Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్లో నోరూరించే తెలంగాణ వంటకాల ఫుడ్ మెనూ !!

  • Andhra King Taluka Review : రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రివ్యూ!

  • Viral: చిరు తో కొండా సురేఖ సెల్ఫీ..మెగా క్రేజ్ అంటే ఇది కదా !!

Trending News

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd