HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan On Law And Order Situation In Andhra

AP Law and Order: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు రాజకీయ బాసుల మాటకు తలొగ్గవద్దు – ‘పవన్ కళ్యాణ్’

నేరాలకు పాల్పడేవారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకొంటుంటే ఇక శాంతిభద్రతల గురించి ఆలోచన కూడా చేయలేం అని అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.

  • Author : Hashtag U Date : 24-05-2022 - 4:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
pawan kalyan
pawan kalyan

నేరాలకు పాల్పడేవారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకొంటుంటే ఇక శాంతిభద్రతల గురించి ఆలోచన కూడా చేయలేం అని అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. కాకినాడలో ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల వ్యవహార శైలి, ఆ హత్య తానే చేశానని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఒప్పుకొన్న తరవాత కూడా అధికారులు అతని పట్ల అత్యంత గౌరవమర్యాదలు కనబరిచిన తీరు చూస్తే విస్మయం కలుగుతోంది. సామాన్యుల పట్ల కూడా ఇంతే సహృదయత కనబరుస్తారా? ఈ విధమైన తీరుకి పోలీసుల కంటే వారిపై ఆధిపత్యం చలాయిస్తున్న రాజకీయ బాసులే కారణం. కోడి కత్తి కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదు అన్నవారే ఇప్పుడు ఆ శాఖకు దిశానిర్దేశం చేస్తున్నారు.

కోడి కత్తి కేసు పురోగతి ఏమిటో తెలియదు. పులివెందులలో వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం గుండె పోటు నుంచి గొడ్డలి పోటు వరకు వెళ్లింది. ఇప్పటికీ సాగుతున్న విచారణలో అసలు దోషులెవరో తేలలేదు. ఇవే కాదు – సామర్లకోట మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసిన గిరీష్ బాబు అనే ఎస్సీ యువకుడిపై అధికార పార్టీ వేధింపులకు దిగింది. అందుకు పోలీసులను వాడుకోవడంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి పోలీసు అధికారి కాలర్ పట్టుకొని దుర్భాషలాడినా పోలీసులు మౌనం వహించాల్సి వచ్చింది. భీమవరం నియోజకవర్గంలోని మత్స్యపురి గ్రామంలో విజయోత్సవాలు చేసుకొంటున్న జనసేన సర్పంచ్, వార్డు సభ్యుల ఇళ్లపై అధికార పార్టీ తెగబడి దాడులు చేసింది.

పలమనేరులో వైసీపీ నేత చర్యలకు మిస్బా అనే పదో తరగతి బాలిక స్కూలుకు దూరమై ఆత్మహత్య చేసుకొంది. మట్టి తవ్వకాలు అడ్డుకొన్న గుడివాడ ఆర్.ఐ.పై దాడి చేసినా ఏ చర్యలూ లేవు. సోషల్ మీడియాలో పోస్టింగుల పేరుతో జనసేన కార్యకర్తలపై కేసులు బనాయిస్తూ, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ రాష్ట్రంలో దాడి చేసినా, హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా ఏం జరగదు అనే ధైర్యం నేరస్తులకు కలగడానికి కారణం- పాలకుల వైఖరే. కోడి కత్తి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో అసలు నేరస్తులను పట్టుకొని చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించి ఉంటే, నేరం చేసేవాళ్ళకు పోలీసులపై చులకన భావన, ఏమీ కాదులే అనే ధైర్యం వచ్చి ఉండేవా?
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను వైసీపీ పాలకుల నుంచి ఏమీ ఆశించలేం. వారికే చిత్తశుద్ధి ఉంటే- హత్య చేశాను అని ఒప్పుకొన్న ఎమ్మెల్సీపై ఈపాటికే పార్టీపరంగాను, పెద్దల సభ నుంచి పంపేలా చర్యలకు ఉపక్రమించేవారు. కాబట్టి పోలీసు అధికారులే బాధ్యత తీసుకొని రాజకీయ బాసుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా శాంతిభద్రతల పరిరక్షణలో స్వతంత్రంగా వ్యవహరించాలి. అప్పుడే ప్రజలకు పోలీసు వ్యవస్థపై, చట్టాలపై విశ్వాసం కలుగుతుంది అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhr pradesh law and order
  • andhra pradesh politics
  • Jana Sena
  • Pawan Kalyan

Related News

Pawan Dimsa Dancce

సంక్రాంతి వేడుకలు : ధింసా నృత్యం చేసిన పవన్ కళ్యాణ్

పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవాలను డిప్యూటీ సీఎం పవన్ ప్రారంభించారు. అక్కడున్న డోలు కళాకారులను ఆప్యాయంగా పలకరించి గిరిజనులతో ఉత్సాహంగా ధింసా నృత్యం చేశారు. అనంతరం సామూహిక సీమంతాల కార్య క్రమంలో పాల్గొని గర్భిణులకు పండ్లు

  • Sakshi Vaidya

    పవన్ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.. ఆ కారణంగానే మూవీ వద్దు అన్నాను : సాక్షి వైద్య

  • Ap Avakaya Festival

    రేపటి నుండి విజయవాడ లో ‘ఆవకాయ- అమరావతి’ ఉత్సవాలు

  • Kondagattu Giri Pradakshina

    కొండగట్టు గిరి ప్రదక్షిణకు గ్రీన్ సిగ్నల్

  • Pawan Kalyan Narrowly Escap

    కొండగట్టు లో పవన్ కళ్యాణ్ కు తప్పిన పెను ప్రమాదం

Latest News

  • ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

  • వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

  • కూలే క్యాన్సర్ అంటే ఏమిటి? ప్ర‌ధాన ల‌క్ష‌ణాలివే!

  • ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు

  • బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ దెబ్బ.. భారతీయ కంపెనీ కీలక నిర్ణయం!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd