HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Is Selling His Properties

Pawan Kalyan Properties : ఎన్నికల కోసం సొంత ఆస్తులు అమ్ముకుంటున్న పవన్ కళ్యాణ్..?

  • Author : Sudheer Date : 27-02-2024 - 3:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Pro
Pawan Pro

ఎన్నికల్లో (Elections) గెలవాలంటే పేరు , హోదా , ప్రజలకు మంచి చేయాలనే తపన ఉంటె సరిపోదు..చేతిలో కోట్ల డబ్బు ఉండాలి..అప్పుడే ఎన్నికల్లో గెలుస్తాం. ప్రస్తుతం డబ్బే అన్ని నడిపిస్తుంది. ఇక రాజకీయాల్లో అయితే డబ్బే ప్రదానం. డబ్బు ఎంత ఖర్చు చేస్తే అంత పేరు , గెలుపు ఉంటుంది. ప్రజలకు మంచి చేయాలనే తపనను ఎవ్వరు పట్టించుకోరు..ఎన్నికల ప్రచారం లో ఎంత ఖర్చుపెట్టాం..ఎన్ని మందుసీసాలు పంపిణి చేసాం..ఎన్ని బిర్యానీ ప్యాకెట్లు పంచాం..ఎంతమందిని వెనకేసుకొని తిరిగాం అనేది ఓటర్లు చూస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుండి పోలింగ్ పూర్తి అయ్యేవరకు ఓటర్లకు , కార్యకర్తలకు , నేతలకు డబ్బు పంచుతూనే ఉండాలి. అప్పుడే గెలుపు అనేది డిసైడ్ అవుతుంది. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తే అంత గెలుపు అనేది ఉంటుంది. అందుకే ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థి వందల కోట్లు పట్టుకొని నిల్చువాలి. అభ్యర్ధే ఆ రేంజ్ లో ఖర్చు చేయాలంటే..పార్టీ అధినేత ఎంత ఖర్చు పెట్టాలో ఓసారి ఆలోచించండి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆ కోట్ల కోసం సొంత ఆస్తులు (Properties ) అమ్ముతున్నట్లు (Selling ) ఓ వార్త బయటకు వచ్చింది.

సినిమాల్లో రోజుకు రెండు కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్..ప్రజలకు ఏదో మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గరి నుండి ఆయనకు మంచి కంటే చెడె ఎక్కువ జరుగుతుంది. పనికిరాని వారితో మాటలు పడాల్సి వస్తుంది..పదేళ్లుగా సినిమాలు చేస్తే వచ్చిన డబ్బుతో పార్టీ నడిపిస్తూ..ఆపదలో ఉన్న వారిని ఆర్ధికంగా ఆదుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల బరిలో నిల్చున్నాడు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని వచ్చిన పవన్…ఇప్పుడు తన బ్యాంకు అకౌంట్ లో జీరో బాలన్స్ కు వచ్చే స్థితికి వచ్చాడు. పార్టీ నిర్వహణకు, అభ్యర్థులను నిలబెట్టడానికి డబ్బులు లేకపోతే ముందుకు పోలేని పరిస్థితి. అందుకే పవన్ కల్యాణ్ తాను సినిమాల్లో నటించి సంపాదించుకున్న ఆస్తులు ఒక్కోటి అమ్ముతున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. తన ఆస్తులు అమ్మి దాదాపు 100 కోట్ల రూపాయల దాకా ఎన్నికల ఖర్చులకు సిద్ధం చేస్తున్నాడట.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ..హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 20 కోట్ల రూపాయల స్థలాన్ని ఇప్పటికే అమ్మేసినట్లు తెలుస్తుంది. ఈ స్థలాన్ని ఓ పారిశ్రామికవేత్త కొనుగోలు చేసాడట. ఇదే తరహాలో మరికొన్ని స్థలాలను అమ్మడానికి పవన్ బేరాలు మొదలుపెట్టారట. ఈ మధ్య జనసేన పార్టీ నిర్వహణకు… ఫ్లైట్లలో తిరగడానికి 20 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు. గత నెలలోనే పవన్ 10 కోట్ల రూపాయలను పార్టీ ఫండ్ గా ఇచ్చారు. ఇప్పుడు తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును కూడా ఆయన భరించాలని డిసైడ్ అయ్యాడట. అందుకోసం ఒక్కో అభ్యర్థికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అంత మొత్తం ఇవ్వడానికి జనసేన దగ్గర ఫండ్ లేదు. అందుకే సొంత ఆస్తులు అమ్మక తప్పట్లేదని సన్నిహితులకు పవన్ చెప్పాడట. హైదరాబాద్ లో ఇంటి స్థలాన్ని గత వారమే అమ్మేశారు.

ఇలా పార్టీ కోసం సొంత ఆస్తులను అమ్మే స్థితికి పవన్ చేరుకోవడం అబిమానులను ఆవేదనకు గురి చేస్తుంది. మాములుగా ఈరోజుల్లో సర్పంచ్ వ్యక్తులే లక్షల కొద్దీ సంపాదిస్తుంటే..పవన్ మాత్రం ఉన్న డబ్బును పోగొట్టుకుంటున్నాడట. ఇలాంటి వారు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇంత చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ప్యాకేజ్ స్టార్ అని ఎలా అనాలనిపిస్తుందో అని అంత వాపోతున్నారు. నిజంగా ప్యాకేజ్ తీసుకునే ఇలా సొంత ఆస్తులు అమ్మవాల్సిన అవసరం ఏముంటుంది..? పిల్లల కోసం దాచిన డబ్బులు ఎందుకు తీయాల్సి వస్తుందని..? అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రీసెంట్ గా హైపర్ ఆది కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.

Read Also : Pawan Kalyan..ప్రజలు పంచె ప్రేమకు బానిస..పార్టీలు పంచె డబ్బుకు కాదు – హైపర్ ఆది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Election expenses
  • Pawan Kalyan
  • Pawan Kalyan Properties
  • selling his property

Related News

Chandrababu Pawan Kalyan

తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

బుధువారం జరిగిన రెండు గంటల సుదీర్ఘ భేటీలో, రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) కుట్రలు చేస్తోందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతిని కలిగించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు

  • Pawan Kalyan Narrowly Escap

    పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్

  • Pawan Kalyan

    పవన్ కళ్యాణ్ ను రోజు తిడితే ఎమ్మెల్సీ పదవి !!

  • Pawan Kalyan Campaign In Mu

    తెలంగాణ మున్సిపల్ బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్

  • Bolli Shetty Satyanarayana

    జనసేనకు బిగ్ షాక్ ఇచ్చిన కీలక నేత..అయోమయంలో పార్టీ శ్రేణులు !!

Latest News

  • BSNL సరికొత్త ఆఫర్ ! అతి తక్కువ రీఛార్జ్ తో రోజుకు 2.6 జీబీ డేటా తో ఏడాది అంత మాట్లాడొచ్చు !!

  • Parliament : ప్రధాని మోదీపై దాడికి యత్నించిన మహిళా ఎంపీలు

  • ఇలా తయారేంట్రా బాబు !! భర్త ను ప్రియుడితో కలిసి ఆక్సిడెంట్ చేసి హత్య చేసిన భార్య

  • IT Act: ఈ నెలాఖరులోగా కొత్త ఐటీ రూల్స్

  • యాటిట్యూడ్ స్టార్ చేసిన పనికి తలలు పట్టుకున్న నిర్మాతలు

Trending News

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd