Pawan Kalyan: కేశసంపదను పీక్కోవద్దమ్మా…ఉన్నదంతా ఊడిపోతుంది-పవన్
జనసేనపార్టీ ఆధ్వర్యంలో రెండో విడత జనవాణి కార్యక్రమాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించారు. జనవాణి-జనసేన భరోసా పేరుతో ఆర్జీలను స్వీకరించారు.
- Author : hashtagu
Date : 10-07-2022 - 9:31 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేనపార్టీ ఆధ్వర్యంలో రెండో విడత జనవాణి కార్యక్రమాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించారు. జనవాణి-జనసేన భరోసా పేరుతో ఆర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేనా అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా పవన్ మాట్లాడారు. అధికార వైసీపీ పై మండిపడ్డారు. ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు పవన్. ఎవరైనా మరణిస్తే…ఓ చిన్న పార్టీ అయిన మేమే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం…ప్రభుత్వం దగ్గర ఆ మాత్రం డబ్బు కూడా లేదంటూ ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడితే…పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ బూతులు మాట్లాడుతన్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశసంపదను పీక్కోవద్దమ్మా…ఉన్నదంతా ఊడిపోతుంది జాగ్రత్త అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
భవన నిర్మాణ కార్మికుల అంశం చాలా కీలకమైందన్నార. సమాజంలో 40శాతం శ్రామికశక్తిగా కాగా…వాళ్లలో 4వ వంత మేస్త్రీలు, పెయింటర్లు, ప్లంబర్లు ఉన్నారన్నారు. వాళ్ల సంక్షేమ నిధిలో 918కోట్లు ఉన్నాయని…వాళ్లకు సంబంధించిన నిధులు ఆపేశారని మండిపడ్డారు. ఇక ఇసుకను అడ్డగోలుగా దోచేస్తున్నారని…ఇసుక దొరకుతుంది కానీ అంతా తమిళనాడుకు, కర్నాటకకు వెళ్లిపోతుందని..ఇక్కడికొచ్చేసరికి ధర పెరిగిపోతోందని కొందరు తనతో చెప్పినట్లు పవన్ అన్నారు.