HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Dhimsa Dance

Pawan Kalyan Dhimsa Dance : మహిళలతో కలిసి పవన్ కళ్యాణ్ దింసా నృత్యం

Pawan Kalyan Dhimsa Dance : స్థానిక మహిళలతో కలిసి ఆయన కాలు కదిపారు. ఇది చూసి అక్కడి వారే కాదు యావత్ అభిమానులు , పార్టీ శ్రేణులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ..ఈ డాన్స్ తాలూకా వీడియోస్ ను షేర్ చేస్తున్నారు

  • By Sudheer Published Date - 08:46 PM, Fri - 20 December 24
  • daily-hunt
Pawan Dhimsa Dance
Pawan Dhimsa Dance

మన్యం జిల్లా పర్యటన(Pawan Kalyan Manyam Tour)లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థింసా నృత్యం(Pawan Kalyan Dhimsa Dance) చేసి ఆకట్టుకున్నారు. స్థానిక మహిళలతో కలిసి ఆయన కాలు కదిపారు. ఇది చూసి అక్కడి వారే కాదు యావత్ అభిమానులు , పార్టీ శ్రేణులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ..ఈ డాన్స్ తాలూకా వీడియోస్ ను షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన జోరు వానలో సాగింది. ఓ పక్క జోరుగా వర్షం పడుతున్న పవన్ కళ్యాణ్ ఏమాత్రం లెక్కచేయకుండా తన పర్యటనను పూర్తి చేసారు. అలాగే మన్యం ప్రజలు సైతం పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్ కం చెప్పారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన సాగింది. గిరిజన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ కాలి నడకన పర్యటిస్తూ అక్కడ స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. గ్రామాల్లో అంతర్గత రహదారులను పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.

మక్కువ మండలం, కవిరిపల్లి గ్రామం ప్రారంభం నుంచి చివర వరకు కాలికి చెప్పులు లేకుండా నడిచారు. చీపురు వలస సమీపంలోని వెంగళరాయసాగర్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ప్రకృతి అందాలను తిలకించారు. కొండలు జలపాతాలను స్వయంగా మొబైల్ లో బంధించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, సిద్దవటంతోపాటు ఇక్కడ అడ్వంచర్ టూరిజం అభివృద్ధి చేయాలని.. ఇందుకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖకు తెలియచేయాలని అధికారులకి సూచించారు. ఇక శంబర గ్రామంలో శ్రీ పోలమాంబ ఆలయం వద్ద పనికి ఆహార పథకం నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును పరిశీలించి , రోడ్డు క్వాలిటీ, నిర్మాణ వ్యయం తదితర అంశాలను తెలుసుకున్నారు. కొత్త రోడ్డును తన మొబైల్ లో వీడియో తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా స్థానిక మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఆయన నృత్యం చేసి ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

మన్యం పార్వతీపురం జిల్లా, బాహుజాల గ్రామం నుండి చిలకల మండంగి వైపు గిరిజనుల ఇబ్బందులు తెలుసుకునేందుకు నడుస్తూ వెళ్తున్న సమయంలో గిరిజన మహిళలు ఆప్యాయంగా ఆహ్వానించడంతో వారితో కలిసి సాంప్రదాయ నృత్యం చేసిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan #APGovtForTribalWelfare pic.twitter.com/ayZU7JGTAj

— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 20, 2024

Read Also : Formula E Race Case : ఈ ఫార్ములా రేస్ పై రేవంత్ గోబెల్స్ ప్రచారం – హరీశ్ రావు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Manyam Tour
  • Pawan Kalyan
  • Pawan Kalyan Dhimsa Dance

Related News

Ap Gst

GST : GST లాభాలపై రాష్ట్రవ్యాప్త ప్రచారం – సీఎం చంద్రబాబు

GST : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా జీఎస్టీ (GST) పై తీసుకున్న కేంద్ర నిర్ణయాన్ని ప్రజలకు చేరవేయడానికి ప్రత్యేక వ్యూహం రూపొందించారు

  • Ntr Bharosa Pension Scheme

    AP Govt : పెన్షన్ల పంపిణీకి రూ. 2745 కోట్లు విడుదల

  • Ycp

    YCP Sainyam : నియోజకవర్గానికి 8000 మందితో YCP సైన్యం

  • OG Collections

    OG Collections: ప‌వ‌న్ క‌ళ్యాణ్ OG విధ్వంసం.. 4 రోజుల్లో ఎంత క‌లెక్ట్ చేసిందంటే?

  • Pawan Cbn

    CBN Meets Pawan : పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

Latest News

  • Hardik Pandya: ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌.. టీమిండియాకు బిగ్ షాక్‌?!

  • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

  • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

  • TVK : మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీవీకే

  • H1B : వీసా ఆంక్షలు భారతదేశ 283 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమపై ఒత్తిడి ?

Trending News

    • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

    • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

    • India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

    • Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

    • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd