Pawan Kalyan: జగన్ రెడ్డీ.. నువ్వు నొక్కని బటన్లేంటో చెబుతా విను.. పెద్ద చిట్టా చదివిన పవన్
బటన్లు నొక్కితే అన్ని వచ్చేస్తాయి అనుకుంటున్నారు. జగన్ రెడ్డీ.. నువ్వు నొక్కని బటన్లేంటో చెబుతాను వినండి అంటూ పవన్ పెద్ద చిట్టా చెప్పారు.
- By News Desk Published Date - 10:01 PM, Mon - 26 June 23

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేపట్టిన వారాహి విజయ యాత్ర (Varahi Vijaya Yatra) సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) లో కొనసాగింది. జిల్లాలోని నరసాపురం వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ వన్‌గా చేసే బాధ్యత జనసేన తీసుకుంటుందని తెలిపారు. నాయకుడు బలంగా ఉంటే దేశం, రాష్ట్రం దశదిశ మారుతుంది. వచ్చే పాతికేళ్లలో రాష్ట్రం అభివృద్ధి కోసం గొడ్డు చాకిరి చేస్తా అని పవన్ చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధికోసం సమగ్రమైన ప్రణాళిక రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తాం. ఉదయ గోదావరి జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని పవన్ అన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల నేను ఓడిపోయినప్పుడు నా గుండె కోసేసింది. నాకు బాధ అనిపించింది. అవినీతిపరులను గెలిపించారు. మంచి ఆశయంతోవచ్చిన నన్ను ఎందుకు ఓడించారా అనిపించింది అని పవన్ అన్నారు.
గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. వ్యవసాయానికి సంబంధంలేని వ్యక్తులు కూర్చుని బస్తాకు వంద రూపాయలు దోచుకుంటూ లాభాలు గడిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇన్ని డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి. ప్రభాస్ లాగా కష్టపడి సినిమాలు తీయలేదు.. తండ్రి ముఖ్యమంత్రి అయితే పైరవీలు చేసి కోట్ల సంపాదించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో, కడప ఇడుపులపాయలో కూర్చొని దౌర్జన్యలు దోపిడీలు చేసేవాడు. 21 ఏళ్ల వయసులో ఎస్సైని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టాడు. అదీ మన సీఎం చరిత్ర అంటూ పవన్ ఎద్దేవా చేశారు. గోదావరి జిల్లాలో పులివెందుల రౌడీ సంస్కృతి తీసుకువస్తే… సహించమని పవన్ హెచ్చరించారు. గూండాలకు, నాటు బాంబులకు, వేట కొడవళ్లకు భయపడేవారు కాదు ఇక్కడ ప్రజలు. గోదావరికి విష సంస్కృతి చేస్తే తన్ని తగలేస్తాం అంటూ పవన్ హెచ్చరించారు.
బటన్లు నొక్కితే అన్ని వచ్చేస్తాయి అనుకుంటున్నారు. జగన్ రెడ్డీ.. నువ్వు నొక్కని బటన్లేంటో చెబుతాను వినండి అంటూ పవన్ పెద్ద చిట్టా చెప్పారు.
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వక పోవడం నువ్వు నొక్కని బటన్.
నిరుద్యోగులకు ఉద్యోగాలు నువ్వు నొక్కని బటన్.
ఉపాధి లేక వలసలు పోతున్న బ్రతుకులు నువ్వు నొక్కని బటన్.
దళితులను చంపి హంతకులు బయట తిరుగుతున్నారే అదే నువ్వు నొక్కని బటన్.
ఆక్వా రైతులకు గిట్టుబాటు లేకపోవటం నువ్వు నొక్కని బటన్.
మూత పడిన ఎనిమిది వేల బడులు నువ్వు నొక్కని బటన్.
ఆరోగ్యశ్రీ అందక మరణించిన మరణాలు నువ్వు నొక్కని బటన్.
తాగునీరు అందని గ్రామాలు నువ్వు నొక్కని బటన్.
హోలీలో మరణించిన గిరిజన మహిళల బతుకులు నువ్వు నొక్కని బటన్.
అప్పుల ఆంధ్ర ప్రదేశ్ నువ్వు నొక్కని బటన్.
Central Government Funds : తెలంగాణకు రూ. 2,102 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఏపీకి మాత్రం..