HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Comments On Chandrababu Bail

Chandrababu : చంద్రబాబుకి బెయిల్ రావడంపై పవన్ కళ్యాణ్ సంతోషం

సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను

  • Author : Sudheer Date : 31-10-2023 - 3:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Babu Pawan
Babu Pawan

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు కు మధ్యంతర బెయిల్ రావడం పట్ల కుటుంబ సభ్యులు , టీడీపీ శ్రేణులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా పవన్ స్పందించారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

‘తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు గారి విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయనను స్వాగతిద్దాం’ అని ట్వీట్ చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు (Skill Development case)లో సెప్టెంబర్ 9న చంద్రబాబు ను నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ (Chandrababu Arrest) చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10న ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court)లో హాజరుపరిచారు. అనంతరం 10న అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబును తరలించారు. గత 53 రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry Central Jail)నే ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయినా దగ్గరి నుండి కూడా ఆయన్ను బయటకు తీసుకొచ్చేందుకు లాయర్లు ట్రై చేస్తూ వస్తున్నప్పటికీ..వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్య గా చంద్రబాబు ఫై అనేక కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేసింది. ఇదే క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం దృష్టిలో పెట్టుకొని ఆయనకు బెయిల్ మంజుల చేయాలనీ హైకోర్టు ను కోరారు. దీంతో ఏపీ హైకోర్టు (AP High Court) చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.

నాలుగు వారాలపాటు నవంబర్ 24 వరకు అనుమతిచ్చింది. రూ.1 లక్ష పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న చంద్రబాబు (Chandrababu), టీడీపీ అభిమానులకు కోర్టు తీర్పు సంతోషాన్ని కలిగించింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నవంబర్‌ 28న బాబు తిరిగి సరండర్‌ కావాలని ఆదేశించింది. దాంతో పాటు బెయిల్ మీద బయటకు వెళ్లాక ఆస్పత్రికి వెళ్లడం మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని, ఫోన్‌లో మాట్లాడకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Read Also : Air India: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్, త్వరలో ముంబై-మెల్‌బోర్న్ మధ్య నాన్‌స్టాప్ సర్వీసులు

శ్రీ @ncbn గారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/Hd1xjBsOCS

— JanaSena Party (@JanaSenaParty) October 31, 2023


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Chandrababu - Bail
  • Pawan Kalyan

Related News

    Latest News

    • Toing : వైజాగ్‌లో ‘టోయింగ్’ యాప్ సేవలు ప్రారంభం

    • Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగే పనేలేదు !!

    • West Bengal Election : ఆ రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్!

    • Peddi : ఎట్టకేలకు పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

    • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd