CPI Narayana – Pawan : పాపం..నారాయణ ఇప్పుడే లేచినట్లుంది !!
CPI Narayana - Pawan : యువతలో మార్పు తీసుకురావాలన్నదే కమ్యూనిజం ధ్యేయం కాగా, నేటి నేతలు వ్యక్తిగత ప్రచారం కోసం సంఘ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు
- Author : Sudheer
Date : 05-06-2025 - 12:21 IST
Published By : Hashtagu Telugu Desk
సనాతన ధర్మం(Sanatana Dharmam)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పటికే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు సీపీఐ నేత నారాయణ (CPI Narayana) ఈ అంశంపై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా విమర్శలు చేసేందుకు ప్రయత్నించారు. ఇది పవన్ అభిమానులతో పాటు సనాతన ధర్మాన్ని గౌరవించేవారిలో వ్యతిరేకతను రేపింది.
World Environment Day : ప్రకృతి మనందరిది..పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: సీఎం చంద్రబాబు
నారాయణ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని మానవత్వంపై ఆధారపడి ఉందని, అందరినీ సమానంగా చూడాలన్నదే అసలైన సందేశమని పదే పదే చెప్పారు. అయితే ఇతర మతాలపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కేవలం హిందూ ధర్మాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సనాతన ధర్మాన్ని దూషించడాన్ని ఏమాత్రం సహించలేమంటున్నారు.
ఇదిలా ఉండగా నారాయణ వంటి నేతలు ఇప్పుడు తమ రాజకీయాల ద్వారా కమ్యూనిజాన్ని మరింత పతన బాటలోకి నెట్టుతున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. యువతలో మార్పు తీసుకురావాలన్నదే కమ్యూనిజం ధ్యేయం కాగా, నేటి నేతలు వ్యక్తిగత ప్రచారం కోసం సంఘ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. హిందూత్వాన్ని విమర్శించి ఇతర వర్గాలను ప్రసన్నం చేసుకోవాలనేది రాజకీయం కాదని, ఇది ప్రజల్లో వ్యతిరేకతను మాత్రమే పెంచుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.