HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Palla Took Charge As Tdp State President

AP TDP : టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా.. క‌ష్టానికి ఫ‌లిత‌మే ప‌ద‌వి వ‌రించింద‌న్న బాబు

టీడీపీ బీసీల పార్టీ అని మ‌రోసారి నిరూపించింది. రాష్ట్ర అధ్య‌క్షుడిగా గాజువాక ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస‌రావుని టీడీపీ అధినేత‌, ఏపీ

  • Author : Prasad Date : 17-06-2024 - 4:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

టీడీపీ బీసీల పార్టీ అని మ‌రోసారి నిరూపించింది. రాష్ట్ర అధ్య‌క్షుడిగా గాజువాక ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస‌రావుని టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నియ‌మించారు. ప‌ల్లా శ్రీనివాసరావు ఈ రోజు అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో చేప‌ట్టారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతిపెద్ద బాధ్యత అప్పగించామని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. నమ్మకంతో అతిపెద్ద బాధ్యతను అప్పగించామ‌ని.. సమర్ధంగా నిర్వహించాలని ప‌ల్లాని కోరారు. అధికారంలో ఉన్నపుడు ప్రతి కార్యకర్తను దగ్గర చేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికీ తగు గౌరవం కల్పించాలన్నారు. ప్రత్యేకంగా యువతను పార్టీలోకి ఆహ్వానించాల‌ని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుండి యువతను రాజకీయాల్లోకి స్వాగతించాలన్నారు.

యువతతోనే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయని.. జాతీయ అధ్యక్షునిగా పార్టీ పరంగా, ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటానని తెలిపారు. నిత్యం కార్యకర్తలతో అనుసంధానమై పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని.. పార్టీ పరంగా అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ఇస్తానని చంద్ర‌బాబు తెలిపారు. సీనియర్ల సూచనలు, జూనియర్లు, యువత మద్దతుతో పార్టీని మరింత బలోపేతం చేయాలని.. వచ్చే నెల నుండి పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ కూడా పున:ప్రారంభించాలన్నారు. వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల్లో పని చేసిన కార్యకర్తల్ని నియమించి గౌరవించాలన్నారు. అదే సమయంలో పార్టీ కోసం పని చేసిన ప్రతి నాయకుడికీ తగిన గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచించారు.

అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ను ప‌ల్లా శ్రీనివాస్ కలిశారు. రాష్ట్ర అధ్యక్షునిగా నియ‌మితులైన ప‌ల్లాకు నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి క్షణం కార్యకర్త నుండి నాయకుల వరకు అందరికీ తోడుగా నిలవాలని లోకేష్ తెలిపారు కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలు, నాయకులు స్తబ్దుగా ఉన్నారని, వారందరినీ యాక్టి వేట్ చేయాల్సిన గురుతర బాధ్యత ఉందని గుర్తు చేశారు. పార్టీ కార్యాలయంలో మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని, తద్వారా ప్రతి మంత్రి కూడా నెలలో ఒక రోజు కనీసం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండబోతున్నారని తెలిపారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి సముచిత న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ అధినాయకత్వం నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఏం కావాలన్నా అందించేందుకు పార్టీ సిద్ధంగా ఉందని నారా లోకేశ్ తెలిపారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం కోసం అనునిత్యం కష్టబడతానని, సీనియర్ల సలహాలతో పార్టీకి యువరక్తం ఎక్కించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పల్లా శ్రీనివాస్ అన్నారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా చొరవ తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనన్నారు. కష్టబడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని పల్లా శ్రీనివాస్ హామీ ఇచ్చారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • chandrababu naidu
  • nara lokesh
  • Palla Srinivasa Rao Yadav
  • tdp

Related News

Balayya's NBK 112th film launched...

బాలయ్య NBK 112వ చిత్రం ప్రారంభం..

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నూతన చిత్రం (NBK112) గురువారం (జూన్ 25) లాంఛనంగా ప్రారంభం కానుంది. అమరావతిలో నేడు ఉదయం జరగనున్న ఈ పూజా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రాజధాని ప్రాంతం వెంకటపాలెంలోని వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ వేడుక నిర్

  • Ram Charan's shocking reaction to being compared with Nara Lokesh; comments at the Republic Summit go viral.

    Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

  • Cbn Speech

    Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

Latest News

  • IMT : హైదరాబాద్‌లో ‘అభ్యుదయ 2026’ ముగింపు

  • MK Stalin: విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: స్టాలిన్

  • Amazon: అమెజాన్ ప్రైమ్ డే జులై 4 నుంచి ఆఫర్ల సునామీ

  • RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

  • Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd