Padmavati Express : పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన పద్మావతి ఎక్స్‌ప్రెస్ తిరుపతి రైల్వే స్టేషన్‌లోని యార్డ్‌లో పట్టాలు తప్పింది
- By Sudheer Published Date - 08:17 PM, Wed - 19 July 23

తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన పద్మావతి ఎక్స్‌ప్రెస్ (Padmavati Express ) తిరుపతి రైల్వే స్టేషన్‌లోని యార్డ్‌లో పట్టాలు తప్పింది. షంటింగ్ చేస్తుండగా పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. ఈ మధ్య వరుస రైలు ప్రమాదాలు రైలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గోదావరి ఎక్స్ ప్రెస్ , కోరమాండల్ ప్రమాదం , మొన్నటికి మొన్న ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ ఇలా వరుస రైలు ప్రమాదాలు జరిగాయి. కోరమాండల్ రైలు ప్రమాదం లో దాదాపు 270 కి పైగా మృతి చెందారు. దీంతో రైలు ఎక్కాలంటే ప్రయాణికులు భయపడుతున్నారు..ఎక్కడ ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో..ఏంటో అని ఖంగారు పడుతున్నారు.
తాజాగా ఈరోజు బుధువారం పద్మావతి ఎక్స్‌ప్రెస్ (Padmavati Express ) లో ప్రయాణికులెవరూ లేని కోచ్ తిరుపతి రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పింది. షంటింగ్ (కోచ్‌లను రైలుకు లింక్) చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టిన రైల్వే సిబ్బంది కోచ్‌ను మళ్లీ పట్టాల పైకి తెచ్చారు. ఈ కారణంగా రైలును రీషెడ్యూల్ చేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ బయల్దేరాల్సిన పద్మావతి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్. 12763) సాయత్రం 4.55 గంటలకు బయలు దేరాల్సి ఉండగా.. బుధవారం రాత్రి 7.45 గంటలకు బయల్దేరనుంది. అదేవిధంగా తిరుపతి – నిజాముద్దీన్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా రీషెడ్యూల్ చేశారు. తిరుపతి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరాల్సిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రాత్రి 8 గంటలకు బయల్దేరుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు.