HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ntr Will Not Be Born Again Cm Chandrababu

TDP 43rd Foundation Day: NTR లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు – సీఎం చంద్రబాబు

TDP 43rd Fundation Day : ఎన్టీఆర్ (NTR) లాంటి గొప్ప నాయకుడు మళ్లీ పుట్టలేరని, అలాంటి మహానుభావుడికి వారసులమంతా కేవలం పార్టీ సేవకులమేనని, పెత్తందారులు కాదని స్పష్టం చేశారు

  • Author : Sudheer Date : 29-03-2025 - 12:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tdp 43rd Fundation Day
Tdp 43rd Fundation Day

తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని (TDP 43rd Fundation Day) పురస్కరించుకుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh), రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఒక మహనీయుడి విజన్ నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం అని తెలిపారు. ఎన్టీఆర్ (NTR) లాంటి గొప్ప నాయకుడు మళ్లీ పుట్టలేరని, అలాంటి మహానుభావుడికి వారసులమంతా కేవలం పార్టీ సేవకులమేనని, పెత్తందారులు కాదని స్పష్టం చేశారు.

Nara Lokesh: టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మంత్రి లోకేష్ కీల‌క హామీ.. ప్ర‌మోష‌న్ ఇస్తా అంటూ వ్యాఖ్య‌లు!

తెలుగుదేశం పార్టీ విజయంలో కార్యకర్తల పాత్రను ప్రత్యేకంగా ప్రశంసించారు. 43 ఏళ్లుగా పార్టీని ప్రజల గుండెల్లో నిలిపిన వారంతా వారి త్యాగం, కష్టపడే ధోరణి, పార్టీపై ఉన్న విశ్వాసమే ఈ విజయానికి మూల కారణమని చెప్పారు. ఎన్టీఆర్ స్థాపించిన 9 నెలలకే అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ టీడీపీ అని, తన రాజకీయ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన ఎన్టీఆర్ మహాత్ముని ఆశీస్సులే పార్టీకి బలమని తెలిపారు. విపక్షాలు టీడీపీని లేని చేసేందుకు ఎంత ప్రయత్నించినా కాలగర్భంలో కలిసిపోయాయని, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని చంద్రబాబు అన్నారు.

ఈ కార్యక్రమంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, నారా లోకేష్, ఇతర ముఖ్య నాయకులు పుష్పాంజలి అర్పించారు. తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, భవిష్యత్తులోనూ అదే విధంగా ప్రజలకు సేవ చేయడానికి పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రజల మద్దతుతో మరింత బలంగా ముందుకు సాగుతుందని, ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Chandrababu Speech
  • Minister Nara lokesh
  • ntr
  • TDP 43rd Fundation Day

Related News

Korean companies set to queue up for AP

Nara Lokesh: ఏపీకి క్యూ కట్టనున్న కొరియా కంపెనీలు

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నేడు బుసాన్ నగరంలో కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వానికి, కొరియా కంపెనీలకు మధ్య వారధిగా నిలిచేందుకు ఏపీఈడీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అపెక్స్-కొరియా’ సహాయ కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రార

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd