HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ntr Fans Vs Tdp Volunteers Clash In Chandrababu Meeting

Chandrababu Vs Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ వల్ల చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవా..?

  • Author : Sudheer Date : 08-01-2024 - 12:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntr Babu
Ntr Babu

ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Elections) జరగబోతున్నాయి. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టిడిపి (TDP) ఈసారి ఎలాగైనా విజయం సాధించి జగన్ (Jagan) ను గద్దెదించాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఈసారి ఒంటరిగా కాకుండా జనసేన (Janasena)తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతుంది. ఇప్పటికే చంద్రబాబు (Chandrababu) ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ (NTR Fans) అభిమానులు చేస్తున్న హడావిడి చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.

తాజాగా పశ్చిమగోదావరి (West Godavari) , ఎన్టీఆర్ (NTR Dist) జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలకు (TDP Fans), జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల (NTR Fans) మధ్య జరిగిన గొడవ, కర్రలతో దాడి (Fight ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపుతోందని చంద్రబాబు భావిస్తున్నారు. గత కొంతకాలంగా టిడిపి తో పాటు చంద్రబాబు బాలకృష్ణులతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంబంధం లేనట్టుగానే ఉంటున్నారు. కేవలం సినిమాలపై మాత్రమే ఫోకస్ పెడుతున్నారు తప్ప రాజకీయాల వైపు చూడడం లేదు. అంతెందుకు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో యావత్ తెలుగు ప్రజలంతా చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ నిరసనలు, ఆందోళన చేస్తూ రోడ్డు ఎక్కారు. అలాగే సినీ ప్రముఖులు రాజకీయతర పార్టీల నేతలు సైతం చంద్రబాబుకు సపోర్టుగా నిలిచారు. కానీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు మాత్రం చంద్రబాబు అరెస్టు విషయంలో ఏమాత్రం స్పందించలేదు. అప్పటికే ఎన్టీఆర్ పై ఆగ్రహం తో ఉన్న టీడీపీ శ్రేణులు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో కూడా స్పందించకపోయేసరికి మరింత ఆగ్రహం పెంచుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అప్పటినుండి ఎన్టీఆర్ పై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరోపక్క ఎన్టీఆర్ అభిమానులు సైతం టిడిపికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ కు సపోర్ట్ ఇస్తూ వారు పోస్టులు పెడుతున్నారు. ఇలా ఇరువురు పోస్టులు, కామెంట్స్, వ్యతిరేక విమర్శలు చేస్తూ వార్ కొనసాగిస్తూ వస్తున్నారు. గతంలో నారా లోకేష్ పాదయాత్రలో కూడా ఎన్టీఆరే భవిష్యత్ సీఎం అంటూ పోస్టర్లు పెట్టి నారా లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు ఒంగోలులో అయితే ఈ ఏకంగా కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు కట్టే మరింతగా రెచ్చగొట్టారు. ఇలా కొద్ది రోజులుగా పోస్టర్లు ఫ్లెక్సీలు పెడుతూ టిడిపి శ్రేణులను మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం లో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జూనియర్ ఎన్టీఆర్ – టీడీపీ అభిమానుల మధ్య కొట్లాట జరిగింది. కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ఫోటోలతో ఫ్లకార్డు లను పట్టుకొని టీడీపీ సభకు వచ్చి..చంద్రబాబు కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. టిడిపి శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడడం చేయడంతో టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఎన్టీఆర్ ఫోటోలు పట్టుకొని వచ్చిన వారిని సభ నుండి బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట కొట్లాట జరిగింది. అయితే ఇదంతా నిజంగా ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్నారా లేక వైసీపీ కావాలని ఇలా ఎన్టీఆర్ పేరుతో గొడవలు సృష్టిస్తుందా అనేది ఎవరికి అర్థం కావడం లేదు.

దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తే బాగుంటుందని..ఒకవేళ అభిమానులు ఇలాగే చేసినట్లయితే వారికీ నచ్చచెప్పడం వంటిది చేయాలనీ..లేదంటే ఎన్టీఆర్ పేరు చెప్పి ఇంకెన్నో దాడులకు పాల్పడతారని అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఇప్పటికేగా స్పందించి రాబోయే రోజుల్లో ఇలాంటి జరగకుండా చూస్తున్నారో చూడాలి.

Read Also :


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chandrababu
  • Chandrababu Meeting
  • jr ntr
  • Ntr fans vs TDP volunteers Clash

Related News

Nara Lokesh Blackbuck

Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'నైపుణ్యం' (Skill) పోర్టల్‌ను తీసుకువస్తోంది. ఇప్పటికే 25 కీలక రంగాలకు సంబంధించిన డేటా ఇంటిగ్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.

  • Meeting Of CMs

    India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Earthquake In Ap

    Earthquake in AP : ఏపీలో భూకంపం

  • New Airports Ap

    New Airports : ఏపీలో ఏకంగా 09 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళిక..ఎక్కడెక్కడంటే !!

Latest News

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd