Anusha Undavalli: టీడీపీ నాయకురాలు అనూష ఉండవల్లికి నోటీసులు జారీ
టీడీపీ అధికార ప్రతినిధి Anushavundavalకి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
- Author : Balu J
Date : 07-09-2022 - 11:32 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధికార ప్రతినిధి Anushavundavalకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. శింగనమల MLA పద్మావతిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారన్న అభియోగంపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఏలూరులోని RRపేటలో ఆమె వస్త్ర దుకాణానికి వెళ్లిన అనంతపురం పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. 3రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన అనూష పోలీసులు తనకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్న IDలు తనవి కావన్నారు.
ఎవరో ఫిర్యాదు చేస్తే అనంతపురం నుంచి పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడం ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని అన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు చెప్పారు. అయితే, పద్మావతిపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ భీమిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో శింగనమల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.