HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Ramamurthy Naidu Final Rites

Nara Ramamurthy Naidu Final Rites : మరికాసేపట్లో రామ్మూర్తి అంతిమయాత్ర..

Nara Ramamurthy Naidu : నారావారిపల్లెలోని తన నివాసం వద్ద ఉంచిన రామ్మూర్తి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు చంద్రబాబు. ఆయనతో పాటు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, నారా లోకేశ్, బ్రాహ్మణి, సినీ నటులు మోహన్ బాబు, మంచు మనోజ్, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు నివాళి అర్పించారు

  • Author : Sudheer Date : 17-11-2024 - 1:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Ramamurthy Naidu Final
Nara Ramamurthy Naidu Final

ఏపీ సీఎం చంద్రబాబు (AP CM CHandrababu) సోదరుడు..రామ్మూర్తి అంతిమ యాత్ర (Nara Ramamurthy Naidu Final Rites ) మరికాసేపట్లో మొదలుకాబోతుంది. నారా రామ్మూర్తి నాయుడి హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. శనివారం గుండెపోటు కారణంగా కన్నుమూయడంతో నందమూరి, నారా కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. సోదరుడి మరణ వార్త తెలిసి మహారాష్ట్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే మంత్రి నారా లోకేశ్ సైతం తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. నిన్న ఆసుపత్రిలో చంద్రబాబు , నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు కుటుంబసభ్యులు, తెలుగుదేశం పార్టీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

రామ్మూర్తినాయుడు పార్థివదేహం ఆయన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుంది.రామ్మూర్తి నాయుడు భౌతికకాయాన్ని ఈరోజు(ఆదివారం) ఉదయం ప్రత్యేక విమానంలో నారావారిపల్లెకు తీసుకరావడం తో జరిగింది. మంత్రి నారా లోకేశ్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గురుండి తీసుకొచ్చారు. ముందుగా హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రామ్మూర్తి పార్థివదేహాన్ని తిరుపతికి తరలించారు. తిరుపతి నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు తీసుకొచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు సైతం హైదరాబాద్ నుంచి బయలుదేరి నారావారిపల్లెకు చేరుకోనున్నారు.

నారావారిపల్లెలోని తన నివాసం వద్ద ఉంచిన రామ్మూర్తి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు చంద్రబాబు. ఆయనతో పాటు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, నారా లోకేశ్, బ్రాహ్మణి, సినీ నటులు మోహన్ బాబు, మంచు మనోజ్, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు నివాళి అర్పించారు. కాసేపట్లో రామ్మూర్తినాయడు అంతిమయాత్ర ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. తన తల్లిదండ్రుల అంతిమక్రియలు జరిగిన చోటే రామ్మూర్తినాయుడు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

1952లో జన్మించిన రామ్మూర్తి నాయుడు నారా కర్జూరనాయుడు, అమ్మన్నమ్మ దంపతుల రెండో కుమారుడు. చంద్రబాబు కు తమ్ముడు. రామ్మూర్తి నాయుడికి భార్య ఇందిర, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు నటుడు రోహిత్‌, మరొకరు నారా గిరీష్. 1994లో రామ్మూర్తి నాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 1999 వరకు ప్రజలకు సేవలందించారు. అనంతరం ఆయన అనారోగ్యంతో రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు. రీసెంట్ గా నారా రోహిత్ ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రతినిధి-2లో హీరోయిన్ గా నటించిన సిరి లేళ్లను (Siri Lella) రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నిశ్చితార్థానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, ఇంకా నారావారి ఫ్యామిలీ, అలాగే నందమూరి కుటుంబసభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు.

రోహిత్ తన ప్రేమ విషయాన్నీ ముందుగా పెద్దమ్మ భువనేశ్వరికి చెప్పినట్లు ఆ మధ్య వార్తలు బయటకు వచ్చాయి. రోహిత్ ప్రేమ విషయం తెలిసిన తర్వాత… భువనేశ్వరి పెళ్లి పెద్దగా మారారని నారా, నందమూరి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. శిరీష కుటుంబ సభ్యులతో ఆవిడ స్వయంగా మాట్లాడి ఈ సంబంధం కుదిర్చారట. చంద్రబాబు, భువనేశ్వరి ఆశీస్సులతో నోవాటెల్ హోటల్ లో కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. డిసెంబర్ లో పెళ్లి వేడుక జరపాలని అనుకున్నారు కానీ ఇప్పుడు తండ్రి మరణంతో రోహిత్ శోకసంద్రంలో పడిపోయాడు.

నారావారిపల్లెలో తమ్ముడు రామ్మూర్తి నాయుడి పార్థివ దేహానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, కుటుంబ సభ్యులు.#ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/koBKj0mYzF

— Telugu Desam Party (@JaiTDP) November 17, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Nara Ramamurthy Naidu
  • naravaripalli
  • Ramamurthy Naidu Final Rites

Related News

    Latest News

    • Bio-Gas Project : సిద్దిపేటలో బయో-గ్యాస్ ప్రాజెక్ట్ ప్రారంభం

    • అందమైన మహిళ కావాల‌ని అడిగిన ఉగాండా సైన్యాధిపతి!

    • బంగ్లాదేశ్‌లో కలకలం.. నెల రోజుల్లోనే 100 మందికి పైగా పిల్లల మృతి, కారణం ఇదే!

    • ముంబైతో పోరుకు ఆర్సీబీ సిద్ధం.. ప్లేయింగ్ 11లో కీలక మార్పు!!

    • ప్ర‌ముఖ సింగ‌ర్ మృతికి కార‌ణ‌మైన ఛాతీ ఇన్ఫెక్షన్.. ల‌క్ష‌ణాలివే!

    Trending News

      • హోర్ముజ్ జలసంధి క్లియరెన్స్‌కు అమెరికా వ్యూహం!

      • KKR అభిమానులకు గుడ్ న్యూస్.. రూ. 18 కోట్లు పెట్టి కొన్న స్టార్ బౌలర్ ఫిట్!

      • 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 78 వేల సబ్సిడీ.. ఏంటి ఈ ప్రభుత్వ పథకం?

      • చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్‌!

      • ఐపీఎల్‌ 2026లో వైభవ్ సూర్యవంశీ జీతం ఎంతంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd