Yuvagalam : ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ
- Author : Sudheer
Date : 28-11-2023 - 12:10 IST
Published By : Hashtagu Telugu Desk
నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర 211వ రోజుకు చేరుకుంది. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతోంది. దాదాపు రెండు నెలల తర్వాత యాత్ర పున: ప్రారంభం కావడం తో టీడీపీ , జనసేన శ్రేణులు , అభిమానులు , ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తూ లోకేష్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు. మంగళవారం ఉదయం పేరూరు క్యాంప్ సైట్ నుంచి లోకేష్ తన యాత్రను ప్రారంభించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా లోకేష్‌ను కోనసీమజిల్లా ఆక్వా రైతులు కలిసి తమ సమస్యలను చెప్పుకొని తమ ఆవేదనను వ్యక్తం చేసారు. ఈ క్రమంలో ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆక్వా రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సీడీకి జోన్ల విధానం అమలు చేయడం ద్వారా భారీ రేట్లు వసూలు చేస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకా ఆక్వారంగాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతాంగానికి యూనిట్ 1.50 కే విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. ఫీడ్, సీడ్, విద్యుత్ ధరలను తగ్గేలా చర్యలు తీసుకుంటామన్నారు. లోకేష్ హామీలతో ఆక్వా రైతుల్లో సంతోషం కలిగింది.
Read Also : Rajasthan CM : తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రాజస్థాన్ సీఎం