Nara Lokesh : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రేపు సీఐడీ విచారణకు హాజరుకానున్న నారా లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన
- Author : Prasad
Date : 09-10-2023 - 11:11 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన సీఐడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ విజయవాడ చేరుకున్నారు. రేపు ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో నారా లోకేష్ విచారణకు హాజరవుతారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారణ కొనసాగనుంది. సీఆర్పీసీ 41ఏ కింద సెప్టెంబర్ 30వ తేదీన లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి వెళ్లిన అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. రింగ్ రోడ్డు కేసు విచారణలో 41ఏ సెక్షన్ నిబంధనలను పూర్తిగా పాటిస్తామని ఏపీ హైకోర్టుకు సీఐడీ తెలిపింది. విచారణకు లోకేశ్ సహకరించకపోతే, ఆ విషయాన్ని తొలుత కోర్టు దృష్టికి తీసుకొస్తామని… ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తామని కోర్టుకు తెలిపారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ని ఏసీబీ కోర్టు కొట్టివేయగా.. సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుంది.
Also Read: Inner Ring Road case : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరికొంతమందికి షాక్ ఇచ్చిన సీఐడీ