HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Wheeling In Delhi

Nara Lokesh : ఢిల్లీలో చక్రం తిప్పుతున్న నారా లోకేష్

Nara Lokesh : ముఖ్యంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలసి, ఏఐ ఎక్సలెన్స్ సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కోరారు

  • Author : Sudheer Date : 05-02-2025 - 1:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lokesh Delhi
Lokesh Delhi

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రస్తుతం ఢిల్లీ(Delhi Tour)లో రాజకీయంగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ కావడానికి మంగళవారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలసి, ఏఐ ఎక్సలెన్స్ సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, ఇతర అభివృద్ధి సంబంధిత అంశాలపై కూడా చర్చలు జరిగాయి.

ChatGPT- DeepSeek : చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌కు దూరంగా ఉండండి: కేంద్రం ఆదేశాలు..!

బుధవారం కూడా లోకేష్ ఢిల్లీలోనే ఉండి మరికొందరు కేంద్ర మంత్రులను కలుస్తూ వస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ మద్దతు తీసుకొచ్చేందుకు ఆయన ప్రత్యేకంగా శ్రమిస్తున్నారు. అభివృద్ధి పనులకు మరింత ఊతమిచ్చేలా కేంద్రంతో సహకారం పొందే లక్ష్యంతో లోకేష్ తన పర్యటనను కొనసాగిస్తున్నారు. గూగుల్ క్లౌడ్ MD బిక్రమ్ సింగ్, డైరెక్టర్ ఆశిష్తో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేసే డేటా సిటీపై వారితో చర్చించారు. త్వరితగతిన అనుమతులు, భూకేటాయింపులు చేస్తామని లోకేశ్ వారితో చెప్పారు. ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని, కంపెనీ కూడా ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు APకి గేమ్ ఛేంజర్ నిలుస్తుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.

ఇక లోకేష్ ఢిల్లీ పర్యటనకు మరో రాజకీయ కోణం కూడా ఉందని తెలుస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కేంద్ర స్థాయిలో చర్యలు తీసుకునేలా పకడ్బందీగా అడుగులు వేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో లోకేష్ మౌనంగా ఉన్నప్పటికీ, ఆయన ప్రత్యేకమైన ఎజెండాతో ఢిల్లీకి వెళ్లినట్లు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఏపీ అభివృద్ధికి సంబంధించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో నారా లోకేష్ ఢిల్లీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ భేటీలు, చర్చలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • nara lokesh
  • Nara Lokesh Delhi Tour

Related News

Minister Lokesh

విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

మంత్రి లోకేశ్ ఆదేశాలతో యంత్రాంగం పరుగులు పెట్టింది. విద్యార్థిని అడిగిన వెంటనే నిధులు మంజూరు కావడంతో ఏకంగా రూ.18 లక్షల వ్యయంతో CC రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.

  • Kutami Govt

    అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!

Latest News

  • MK Stalin : పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం .. వంటగ్యాస్ కొరతపై తమిళనాడు కీలక నిర్ణయం

  • ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

Trending News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd