Nara Lokesh : అసెంబ్లీ లో లోకేష్ ప్రమాణం పై వైసీపీ సెటైర్లు
'శ్రద్ధాసక్తులు' అనే పదాన్ని పలకడంలో ఆయన ఇబ్బందిపడ్డారు
- By Sudheer Published Date - 03:13 PM, Fri - 21 June 24
ఏపీ సమావేశాలు (AP Assembly 2024) శుక్రవారం ప్రారంభం అయ్యాయి. మొదటిరోజు 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ముందుగా సీఎం చంద్రబాబు..తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ప్రమాణ స్వీకారం చేయగా..ఆ తరువాత వరుసపెట్టి నేతలంతా ప్రమాణ స్వీకారం చేసారు. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు వేర్వేరు కారణాల వల్ల ఈరోజు అసెంబ్లీకి రాలేకపోయారు. రేపు ఉదయం 10.30గంటలకు సభ పున:ప్రారంభం కాగానే మిగిలిన ముగ్గురు సభ్యులు రేపు ప్రమాణం చేసే వీలుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె అసెంబ్లీ లో మొదటిసారి నారా లోకేష్ (Nara Lokesh) ఎమ్మెల్యే హోదాలో ప్రమాణ స్వీకారం చేసారు. ప్రమాణం చేసే సమయంలో నారా లోకేశ్ తడబడటంపై వైసీపీ శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నాయి. ‘శ్రద్ధాసక్తులు’ అనే పదాన్ని పలకడంలో ఆయన ఇబ్బందిపడ్డారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దీనికి టీడీపీ శ్రేణులు స్పందిస్తూ.. ‘కూటమి దెబ్బకు మీ నాయకుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ కూడా తన పూర్తి పేరును మరిచిపోయారు’ అని కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం మీద అసెంబ్లీ స్టార్ట్ అయ్యిందో లేదో వైసీపీ – టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది.
Ravtleda @naralokesh 🤣😂 pic.twitter.com/9cqf43rX5I
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) June 21, 2024
Paapam ma Jagan Anna ni emi anoddu Aseembly lo, ayana rebels leru assembly lo.. mundde silent batch.
Jagan anna baaga dull ayyadu..infront crocodile festival
🤣😂#NBK109 #NandamuriBalakrishna #TDP #janasena #PawanKalyanAneNenu #YSRCP #YCP pic.twitter.com/TtIPIklI3T— NBK_CULT_FAN (@SankarBalayya) June 21, 2024
Read Also : Paper Leaks: ప్రశ్నపత్రాల లీకేజిపై యోగి సర్కార్ సంచలన నిర్ణయం
Related News
Nara Lokesh Congratulates Team: కల్కి సినిమాపై మంత్రి నారా లోకేష్ ట్వీట్.. ఏమన్నారంటే..?
Nara Lokesh Congratulates Team: ‘కల్కి 2898AD’ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ (Nara Lokesh Congratulates Team) చేశారు. కల్కి సినిమా గురించి అద్భుతమైన రివ్యూస్ వినడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలోని నటీనటులందరికీ కంగ్రాట్యులేషన్స్. భారతీయ సినిమాని మరో మెట్టు ఎక్కించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ సిన�