Nara Lokesh : నైపుణ్యం పోర్టల్‌ను ఆగస్టు నాటికి పూర్తి.. అధికారులకు లోకేశ్ హుకుం
Nara Lokesh : విదేశాల్లో ఉపాధి అవకాశాలను అన్వేషిస్తున్న తెలుగు యువతకు మార్గదర్శనంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.
- Author : Kavya Krishna
Date : 16-07-2025 - 12:48 IST
Published By : Hashtagu Telugu Desk
Nara Lokesh : విదేశాల్లో ఉపాధి అవకాశాలను అన్వేషిస్తున్న తెలుగు యువతకు మార్గదర్శనంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. యువతకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తూ, విదేశీ ఉపాధికి దారితీసే నైపుణ్య పోర్టల్ను రూపొందించేందుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ పోర్టల్‌ను వచ్చే ఆగస్టు లోగా పూర్తిచేయాలని, సెప్టెంబర్ 1న అధికారికంగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో అమరావతి సమీపంలోని ఉండవల్లిలో తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. పోర్టల్ రూపకల్పన, శిక్షణా మాడ్యూళ్ల తయారీ, కౌన్సిలింగ్ సేవల కల్పనపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
Aerospace Park : కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ కోసం భూసేకరణ రద్దు..ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అవకాశాలు!
లోకేశ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ పోర్టల్ ద్వారా యువతకు అవసరమైన శిక్షణలతో పాటు, విదేశాల్లో నైపుణ్యాధారిత ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధ సంస్థ అయిన ఓంక్యాప్ (OMCAP) ద్వారా కల్పించనున్నారు. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు మార్గదర్శకాలను రూపొందించాలని లోకేశ్ స్పష్టం చేశారు.
అభ్యర్థులకు ఏవైనా సమస్యలు ఎదురైతే సహాయం పొందేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నెంబర్ 0863-2340678, వాట్సాప్ నెంబర్ 85000 27678లను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే, ఇటీవల థాయ్‌లాండ్‌లో ఉద్యోగాల పేరుతో మోసపోయిన యువతను స్వదేశానికి రప్పించేందుకు ఓంక్యాప్, ఎన్ఆర్‌టీ (NRT)ల సహకారంతో తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు విదేశీ ఉపాధి కోరుకునే తెలుగు యువతకు భరోసానిచ్చేలా ఉంటాయని, భవిష్యత్తులో ఈ పోర్టల్ వారి ప్రయాణంలో మార్గదర్శిగా నిలుస్తుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.
Minister Komatireddy : దసరా నాటికి ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పూర్తి : మంత్రి కోమటిరెడ్డి